Breaking News

కామెడీ థ్రిల్లర్‌.. వారం రోజులకే ఓటీటీలోకి..

Published on Fri, 11/28/2025 - 08:04

థియేటర్‌లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాల తర్వాత కానీ ఓటీటీలోకి రావు. కానీ ఓ తెలుగు మూవీ మాత్రం కేవలం వారానికే ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఆ సినిమాయే పాంచ్‌ మినార్‌. రాజ్‌తరుణ్‌ హీరోగా, రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్‌ మూవీ పాంచ్‌ మినార్‌. రామ్‌ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. 

గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మించారు. ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్‌ తరుణ్‌ గత సినిమాలకంటే ఈ మూవీకి మంచి టాక్‌ వచ్చింది. అయినప్పటికీ కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్‌ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సడన్‌ సర్‌ప్రైజ్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.

కథేంటంటే..
కిట్టు (రాజ్‌ తరుణ్‌) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్‌కాయిన్‌ స్కామ్‌ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్‌ డ్రైవర్‌గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్‌ బుక్‌ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే!

 

చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌ చివరి కెప్టెన్‌ ఎవరంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)