Breaking News

హీరోయిన్‌కు బెదిరింపులు.. భరించలేకపోతున్నానంటూ..

Published on Sat, 04/06/2024 - 21:28

సెలబ్రిటీలు ట్రోలింగ్‌ బారిన పడటం సర్వసాధారణమైపోయింది. అయితే కొందరు విమర్శలతోనే ఆగిపోవడంలేదని బెదిరింపులకు పాల్పడుతున్నారంటోంది హీరోయిన్‌ రైమా సేన్‌. ఏకంగా ఇంట్లోని తన ల్యాండ్‌లైన్‌కు కాల్‌ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం ఆమె 'మా కాళి' అనే సినిమా చేస్తోంది. 1946 ఆగస్టు 16న కలకత్తాలో జరిగిన ఓ దారుణ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోందీ మూవీ. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ రిలీజైంది.

ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు
అది చూసిన కొందరు తనను అదే పనిగా బెదిరిస్తున్నారట. 'నాకు వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకని ఇలా ఏదిపడితే అది అనేస్తున్నారు. మా కాళి సినిమా ఎందుకు ఒప్పుకున్నావని ప్రశ్నిస్తున్నారు. లెజెండరీ నటి సుచిత్రా సేన్‌ మనవరాలుయ్యండి ఇలాంటి మూవీస్‌ చేస్తావా? నువ్వు కూడా కోల్‌కతాలోనే ఉండేది.. అది గుర్తుంచుకో అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ బెదిరింపులు భరించలేకపోతున్నాను' అంది.

తెలుగులో ఒకే ఒక సినిమా
కాగా రైమా సేన్‌ గతేడాది ద వ్యాక్సిన్‌ వార్‌ సినిమాలో కనిపించింది. కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ వివాదంగానే మారింది. ఇప్పుడు మా కాళి మూవీతో ఈ హీరోయిన్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ చిత్రానికి విజయ్‌ ఏలకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈమె తెలుగులో ధైర్యం అనే సినిమాలో నటించింది. ఆమె తల్లి మూన్‌ మూన్‌ సేన్‌, సోదరి రియా సేన్‌ కూడా నటీమణులు కావడం విశేషం.

చదవండి: నయన్‌- విఘ్నేశ్‌లను ఒక్కటి చేసిన హీరో ఎవరో తెలుసా?

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)