ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
డైరెక్టర్గా మారనున్న పాపులర్ కమెడియన్
Published on Sat, 06/14/2025 - 12:57
అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, బ్రోచేవారెవరురా, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). సినిమాలతో బిజీగా ఉన్న ఇతడి దృష్టి తాజాగా దర్శకత్వం మీదకు మళ్లింది. డైరెక్టర్గా ఓ సినిమా చేయబోతున్నానని ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించాడు. అడ్వెంచర్ మూవీ తీయబోతున్నట్లు తెలిపాడు. నటనపై ఆసక్తి గలవారు వారి షో రీల్స్, రెజ్యూమ్లను తన మెయిల్ ఐడీకి పంపించాలని కోరాడు.
రామకృష్ణ కెరీర్
సైన్మా అనే షార్ట్ ఫిలింతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ లఘుచిత్రంతోనే రాహుల్ కెరీర్ ప్రారంభించింది. జయమ్ము నిశ్చయమ్మురా మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి సంభాషణల రచయితగానూ పని చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చివరగా మనమే సినిమాలో కనిపించాడు. ఒకటీరెండు సినిమాల్లో పాటల రచయితగానూ తన ప్రతిభ చూపించాడు.
చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
Tags : 1