Breaking News

50 ఏళ్ల వయసులో పెళ్లి.. తనకంటే భార్య 16 ఏళ్లు చిన్నది

Published on Mon, 07/13/2026 - 15:15

ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు దీక్షిత్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, తొలిప్రేమ, కృష్ణార్జున యుద్ధం తదితర సినిమాల్లో పాటలు పాడాడు. గతేడాది అక్టోబరులో 50 ఏళ్ల వయసులో గాయని వరిజాశ్రీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇతడికి భార్యతో 16 ఏళ్ల ఏజ్ ‍గ్యాప్ ఉండటంపై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై రఘు స్పందించాడు. కొన్ని కామెంట్స్ ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)

'పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు మాకు సంబంధించి ప్రతి విషయంలోనూ అభిప్రాయాలు వస్తాయని ముందే తెలుసు. నిజం చెప్పాలంటే కొన్ని కామెంట్స్ చూసి చాలా బాధ అనిపించింది. అయితే సంతోషకరమైన జీవితానికి చిన్న రహస్యముంది. ఇంటర్నెట్‌లో వచ్చే ప్రతి కామెంట్ సీరియస్‌గా తీసుకోకూడదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నిజమైన ఫ్యాన్స్ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం'

'మేమిద్దరం చాలాకాలం నుంచి ఫ్రెండ్స్. ప్రేమ అనేది విచిత్రమైన అనుభూతి. అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అది సహజంగా జరిగిపోయింది. ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకంతో తీస్తున్న నిర్ణయాల ముందు బయటవాళ్లు చేసే ట్రోల్స్‌కి పెద్దగా విలువ ఉండదు. మా వైవాహిక జీవితం సంగీతానికి మాత్రమే పరిమితం కాదు. కలిసి నవ్వుకుంటాం. సంగీతం కంపోజ్ చేస్తాం. టూర్స్‌కి వెళ్తాం. ఇవే మా బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఆమె అద్భుతమైన సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి' అని రఘు దీక్షిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)