Breaking News

'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు

Published on Mon, 03/24/2025 - 13:28

మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా కన్నప్ప(Kannappa Movie). ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ మూవీపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇదివరకే విష్ణు ఈ విషయమై స్పందించగా.. ఇప్పుడు నటుడు రఘుబాబు (Raghu Babu) మాత్రం వింత కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

'ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్' అని నటుడు రఘుబాబు తాజాగా జరిగిన ఈవెంట్ లో అన్నారు. ఇది విన్న నెటిజన్స్ షాకవుతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌)

ఎందుకంటే గతంలో ఈ చిత్ర టీజర్ రిలీజైనప్పుడు దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో పలువురు యూట్యూబర్స్ పై హీరో, నిర్మాత మంచు విష్ణు (Manchu Vishnu) సీరియస్ అ‍య్యాడనే టాక్ వినిపించింది. ఆ తర్వాత మరో టీజర్ రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా విడుదల చేశారు. కాకపోతే ఈసారి అంత నెగిటివిటీ రాలేదు. ‍ఎక్కడో చోట ట్రోలింగ్ జరుగుతుంది. అంతమాత్రాన దేవుడి పేరు చెప్పి శాపానికి గురవుతారని భయపెట్టడం ఏంటో అర్థం కావట్లేదు.

కంటెంట్ లో దమ్ముంటే సినిమాని ఎంత ట్రోల్ చేసినా సరే హిట్ అవుతుంది. కన్నప్ప మూవీలోనూ ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. కాబట్టి హిట్ అవ్వొచ్చేమో చెప్పలేం. కానీ ఇలా శాపానికి గురవుతారని భయపెట్టడం మాత్రం కాస్త వింతగా ఉందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది!)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)