Breaking News

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. కీలక వ్యాఖ్యలు చేసిన మాదాపుర్ డీసీపీ

Published on Tue, 02/27/2024 - 18:25

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే  9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కొకైన్‌ విక్రయించిన అబ్బాస్‌ అలీని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్‌ డైరెక్టర్‌ వివేకానంద్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద్‌ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో వివేకానంద్‌, కేదార్, నిర్భయ్‌లను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీసీపీ డాక్టర్ వినీత్ స్పందించారు. అసలేం జరిగింది? ఏం జరుగుతుందనేది వివరించారు.

(ఇదీ చదవండి: పరారీలో క్రిష్‌.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్‌!)

'రాడిసన్ హోటల్‌లో కొకైన్ సేవించిన కేసులో డ్రగ్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్‌ని అరెస్ట్ చేశాం. ఇతడు  ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఇప్పటివరకు 10 సార్లు గజ్జెల వివేకానంద్‌కు డెలివరీ చేసినట్లు చెప్పాడ‍ు. ఇదే హోటల్‌లో గతంలో కూడా పార్టీ చేసుకున్నట్లు మాకు తెలిసింది. శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారు. చరణ్.. బెంగళూరులో ఉన్నానని, వస్తున్నానని చెప్పాడు. డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారు. ఇతడు డ్రగ్ టెస్ట్‌కి వస్తున్నానని చెప్పాడు'

'హోటల్ నిర్వాహకులపై కూడా కేసులు పెడతాం. అబ్బాస్ పదిసార్లు డ్రగ్స్ తెచ్చాడు, ఇన్నిసార్లు ఎక్కడి నుండి తెస్తున్నాడో విచారిస్తున్నాం. సరఫరా చేసిన ప్రతిసారి 4 గ్రాముల కొకైన్ తెచ్చాడని తెలిసింది. అలానే డైరెక్టర్ క్రిష్‌ని విచారిస్తాం. డ్రగ్ పరీక్షలు కూడా చేస్తాం. రక్త, మూత్ర పరీక్షలు చేస్తే అసలు నిజమేంటనేది  తెలుస్తుంది. దీంతో పాటు వివేకానంద్ డ్రగ్ పార్టీలు ఎందుకు చేస్తున్నాడో విచారిస్తాం' అని డీసీపీ వినీత్ చెప్పారు.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)