Breaking News

పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

Published on Thu, 10/17/2024 - 07:23

బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే (39) బేబీ బంప్‌ ఫోటోతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా 'సిస్టర్‌ మిడ్‌నైట్‌' లండన్‌లో ప్రీమియర్‌ షో జరుగుతుండగా రాధికా ఆప్టే కూడా పాల్గొంది. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కేన్స్‌లో ప్రదర్శించబడింది. 2024 కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్‌ దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌ 20న విడుదల కానుంది.

రాధికా ఆప్టే అమ్మ కాబోతుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచింది. నవంబర్‌ నెలలో పండంటి బిడ్డకు ఈ బ్యూటీ జన్మనివ్వనుంది.  కెరీర్‌ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్‌ వయొలినిస్ట్‌ బెండిక్ట్‌ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కానున్నడంతో ఆభిమానులు సంతోషంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.

థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్‌ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్‌, హంటర్‌, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్‌, లయన్‌, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా చేరువైంది.  ఇటీవల కాలంలో న్యూడ్‌, సెమీ న్యూడ్‌ చిత్రాల్లో ఆమె నటించడం గమనార్హం.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)