Breaking News

రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్

Published on Tue, 04/14/2026 - 15:35

టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ వైపు సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగానే ఉంది. గతంలో ఫర్జీ, రుద్ర సిరీస్‌ల్లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ యాక్షన్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రాబోతుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ర్యాపర్ కింగ్.. నటుడిగా పరిచయమవుతున్న సిరీస్ 'లుక్కే'. రాశీఖన్నా, పాలక్ తివారి, శివాంకిత్, లక్ష్య్ వీర్ శరణ్ తదితరుల ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిమాంక్ గౌర్ దర్శకుడు. పంజాబ్‌లోని ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్, రివేంజ్ తదితర అంశాలతో దీన్ని తీశారు. వచ్చే నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.

రాశీఖన్నా టాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'తెలుసు కదా' అనే మూవీ చేస్తే ఘోరంగా ఫ్లాప్ అయింది. గత నెలలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వస్తే ఇది కూడా అదే ఫలితాన్ని అందుకుంది. పవన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తే అయినా ఫేట్ మారుతుందనుకుంటే.. ఈమె పాత్ర తీరుతెన్నులకు మరింత ట్రోలింగ్‌కి గురైంది. ఇప్పుడీ సిరీస్‌తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)

Videos

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి

మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..

సీఎం రేసులో కీలక నేతలు

ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్

చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

Photos

+5

సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్స్ (ఫోటోలు)

+5

తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)

+5

రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)