Breaking News

ఆపరేషన్‌ వల్ల చాలా బాధలు పడ్డాను.. ఎవరూ అడగలేదు: రాధికా శరత్‌కుమార్‌

Published on Sat, 03/08/2025 - 09:57

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్ రాధికకు సర్జరీ జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని చెబుతూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ షేర్‌ చేశారు. కష్ట సమయంలో మహిళలు ఎలాంటి దృఢ సంకల్పంతో ఉండాలో ఆమె తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆమె కాలికి తీవ్రమైన గాయం అయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు దాని గురించి రాధికా ఎక్కడా స్పందించలేదు.

అయితే, తాజాగా రాధికా శరత్‌ కుమార్‌ తన గాయం గురించి ఇలా చెప్పారు.  'గత రెండు నెలలుగా చాలా బాధలు పడుతున్నాను. ఎవరూ నా వర్క్‌, నా గురించి మాట్లాడలేదు. రెండు సినిమాల్లో పనిచేస్తున్న సమయంలో నేను అధిక బరువు ఉన్న బ్లింకర్లు ధరించడం వల్ల నా మోకాలికి తీవ్రమైన గాయం అయింది. అప్పుడు నా మోకాలి వద్ద విపరీతమైన నొప్పి కలిగింది. నొప్పి నివారణ కోసం ఎన్నో మందులతో పాటు మోకాలి బ్రేస్, క్రయోథెరపీ వంటి వాటిని పాటించాను. కానీ, ఎలాంటి ఫలితం లేదు. తప్పని పరిస్థితిలో రెండు నెలల క్రితం సర్జరీ చేపించుకున్నాను.' అని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను బాగున్నట్లు కూడా చెప్పారు.

నొప్పి భరిస్తూనే సినిమా ఎలా పూర్తి చేశారని తన స్నేహితుడు ఒకరు ఆశ్చర్యపోయాడని రాధిక గుర్తుచేసుకున్నారు.  ఆ నిర్మాతలు  కృతజ్ఞతలు ఏమైనా చెప్పారా..? అని కూడా ఆ స్నేహితుడు అడిగినట్లు రాధిక చెప్పుకొచ్చారు.  కానీ, తనకు కృతజ్ఞతలు వంటి వాటిని పట్టించుకోనని రాధిక చెప్పారు. అలాంటివి ఎప్పుడూ తాను ఆశించలేదని, ఉత్తమంగా పనిపై మాత్రమే దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు.  మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి స్త్రీ తనను తాను మరింతగా ప్రేమించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. ఇతరులు చూపే సింపతీ తీసుకోవద్దని తెలిపారు. అయితే,  శస్త్రచికిత్స జరిగినప్పుడు తన భర్త శరత్‌ కుమార్‌ తనను  చిన్నపిల్లలా చూసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో మూలస్థంభంలాంటి వ్యక్తి తన భర్తే అంటూ ఆమె చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)