Breaking News

అర్ధరాత్రి రజనీతో బైక్‌ రైడ్‌.. అనిరుధ్‌ తండ్రి మమ్మల్ని అడ్డుకుని!

Published on Sun, 02/08/2026 - 17:53

దక్షిణాదిన ఎంతోమంది స్టార్‌ హీరోలతో జోడీ కట్టిన రాధికా శరత్‌కుమార్‌ ఈసారి చాలా డిఫరెంట్‌ పాత్రలో కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ "తాయి కిళవి". ఈ చిత్రంలో తను ఊరిలో రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో శివకార్తికేయన్‌ నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.

బైక్‌పై తిరిగాం
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఒకరోజు రజనీకాంత్‌, నేను బైక్‌పై చెన్నై అంతా తిరిగాం.  నేను ఇక్కడే తిన్నాను, ఇక్కడే నిద్రపోయాను, ఇక్కడే కొన్నాళ్లు ఉన్నానంటూ రజనీ తను తిరిగిన ప్రదేశాలన్నీ నాకు చూపించాడు. రజనీ లైఫ్‌ స్టోరీ తన నోటి నుంచి వింటున్నప్పుడు చలించిపోయాను.

జీవితంలో అనేక కష్టాలు
ఇన్ని కష్టాలు పడ్డాడా? అని ఫీలయ్యాను. చాలామంది జీవితంలో అనేక కష్టాలు చూసుండొచ్చు. కానీ, రజనీకాంత్‌ తన బాధ, కష్టం, శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని అట్టడుగు స్థాయి నుంచి తారాస్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే మేము అలా బైక్‌పై తిరుగుతూ ఉంటే సడన్‌గా ఒక కారు మమ్మల్ని చేజ్‌ చేసుకుంటూ వచ్చి మా ముందు ఆగింది. నాకు ఒక్కసారిగా భయమేసింది. 

సీక్రెట్‌ షికారు అనుకుని..
అయితే వచ్చింది మరెవరో కాదు, రజనీకాంత్‌ భార్య లత సోదరుడు, నటుడు రాఘవేంద్ర. రజనీకాంత్‌ అర్ధరాత్రి ఒక మహిళను వెంటేసుకుని రహస్యంగా షికార్లు చేస్తున్నాడని భావించి మమ్మల్ని ఆపేందుకు వచ్చాడు. కానీ.. రజనీ, నేను షికారుకు వెళ్లామని లతకు ముందే తెలుసు. దీంతో అతడి ఆందోళన నీరుగారిపోయింది అని చెప్పుకొచ్చింది. కాగా రజనీకాంత్‌ భార్య, నిర్మాత, సింగర్‌ లత తమ్ముడే నటుడు రవి రాఘవేంద్ర. ఈయన కుమారుడు అనిరుధ్‌ రవిచందర్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు.

చదవండి: సంతోషంగా లేను, మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు: శ్రీజ దమ్ము

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)