Breaking News

ఒక శకం ముగిసింది.. గద్దర్‌ మరణంపై ఆర్‌ నారాయణమూర్తి దిగ్భ్రాంతి

Published on Sun, 08/06/2023 - 17:08

తెలంగాణ చైతన్య గీతిక, ప్రజల గొంతుక శాశ్వతంగా మూగబోయింది. ప్రజాగాయకుడు గద్దర్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) తుదిశ్వాస విడిచారు. గద్దర్‌ మరణంపై నటుడు, దర్శకనిర్మాత ఆర్‌ నారాయణ మూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఒక అన్నమయ్య పుట్టారు, దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు, దివంగతులయ్యారు. ఒక పాల్‌ రబ్సన్‌ పుట్టారు, దివంగతులయ్యారు. ఒక గద్దర్‌ పుట్టారు, దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది' అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కాగా గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. 1949లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని తుప్రాన్‌లో జన్మించారు. తన పాటలతో ఎంతో మందిని ఉత్తేజపరిచారు.  తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న గద్దర్‌కు ఇటీవలే గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడంతో విషాదం నెలకొంది.

చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత
చిన్నతనంలోనే గద్దర్‌ మనసుకు గాయాలు.. ఎన్నెన్నో అవమానాలు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)