Breaking News

OTT: హాలీవుడ్‌ మూవీ ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ రివ్యూ

Published on Thu, 11/28/2024 - 14:43

ప్రతి మనిషికీ ఆలోచనలుంటాయి. కాని కొంతమందికి ప్రత్యేక ఆలోచనలొస్తాయి. మరీ ముఖ్యంగా హాలివుడ్ దర్శకులకు విపరీతధోరణితో ఆలోచనలొస్తాయి. మనమెప్పుడూ ఊహించని కనీ వినీ ఎరుగని విపత్తులు ఈ హాలివుడ్ దర్శకులకు ఆలోచనల రూపంలో కనిపిస్తాయి. అవి వాళ్ళు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుంచుతారు. ఆ నేపధ్యంలో వచ్చిన సినిమానే ఎ క్వైట్ ప్లేస్ డే వన్. ఈ సినిమా సీరిస్ లో మూడవది. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. ఇప్పుడు వచ్చిన ఎ క్వైట్ ప్లేస్ డే వన్ నెల రోజుల క్రితమే ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా పెయిడ్ ఫార్మెట్ లో విడుదలవగా ఈ వారమది అందరికీ అందుబాటులోకి వచ్చింది.  

దాదాపు ముప్ఫై ఏడేళ్ళ క్రితం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు పుష్పకవిమానం అనే ప్రత్యేకమైన సినిమా తీశారు. సినిమాలో ఒక్క డైలాగ్ లేకుండా చక్కటి కామెడీతో చూడముచ్చటగా ఉంటుందా చిత్రం. కాని దాదాపు అలాంటి కోవకే చెందిన ఇంగ్లీష్ చిత్రమైన ఎ క్వైట్ ప్లేస్ డే వన్ మాత్రం చూసేవాళ్ళకు చమటలు పట్టించడం ఖాయం. సినిమాలో కథ ప్రకారం మాటలు తక్కువున్నా ప్రేక్షకులకు దడపుట్టిస్తుందీ సినిమా. జాన్ క్రసింస్కీ ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలన్నిటికీ రచయిత. మొదటి రెండు చిత్రాలకు తాను దర్శకత్వం వహించగా తాజా చిత్రానికి మాత్రం మైఖేల్  సర్నోస్కీ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథ ప్రకారం న్యూయార్క్ లో హాస్ స్పైస్ అనే ఫెసిలిటీలో క్యాన్సర్ పేషంట్ కా వున్న సామ్ తన కుక్క పిల్లతో వాలంటీర్ రూబెన్ తో కలిసి ఓ ప్లే చూడడానికి సిటీలోకి వెళ్తుంది. 

సామ్ కి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటూనే వుంటుంది.అప్పుడే మాన్ హాట్టన్ నగరంపై ఏలియన్స్ దాడి జరుగుతుంది. ఈ ఏలియన్స్ ఎక్కడైనా శబ్దం వస్తే చాలు కనిపించిన మనుషులను దారుణంగా దాడి చేస్తూవుంటాయి. ఈ దశలో నగరమంతా వాటి దాడి వల్ల క్షణాల్లో నిర్మాణుష్యమైపోతుంది. అక్కడక్కడా శబ్దం చేయకుండా బ్రతికున్న వాళ్ళు ఏలియన్స్ నుండి తప్పించుకుంటూ వుంటారు. అసలే క్యాన్సర్ బారిన పడిన సామ్ తనను తాను కూడా ఈ ఏలియన్స్ దాడిని ఎలా ఎదుర్కుంటుందనే మిగతా కథ. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాలో నిశ్శబ్దం ఎంత భయంకరంగా వుంటుందో మీకు సినిమా చూశాక తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వీకెండ్ చూసెయ్యండి. 
- ఇంటూరు హరికృష్ణ

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)