Breaking News

పెళ్లికి సిద్ధమైన జాలిరెడ్డి.. గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్‌

Published on Wed, 02/12/2025 - 15:28

పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు డాలీ ధనుంజయ్. సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు పెళ్లిబంధంలోకి ‍అడుగుపెట్టనున్నాడు. గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ధనుంజయ్ ఈనెల ఓ ఇంటివాడు కానున్నారు. ఈనెల 15,16 తేదీల్లో డాలి ధనుంజయ్- ధన్యతను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్ మైసూరులో జరగనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ధనుంజయ. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

నటుడు డాలీ ధనంజయ్-ధన్యతల వివాహం మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. నటుడు ధనంజయ్‌కి ఇష్టమైన పట్టణం మైసూర్ . ఆ నగరంలోనే చిన్నప్పటి నుంచి చదువుకుని అక్కడే పెరిగారు. ఈ నేపథ్యంలో  ధనంజయ్ తన పెళ్లి ప్లానింగ్స్ గురించి మాట్లాడారు. మైసూర్‌లో పెళ్లి చేసుకోవాలనేది నా కల.. ఎందుకంటే నా చదువు, సినీ రంగ ప్రవేశం అంతా మైసూరు నుంచే జరిగిందని వెల్లడించారు. మాత చాముండేశ్వరి అనుగ్రహం తనకు ఎప్పుడు ఉంటుందని ధనంజయ్ అన్నారు.  అందుకే చాముండేశ్వరి దేవాలయం నమూనాలో పెళ్లి వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ‍్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్‌లోనూ అదరగొట్టేశాడు.

ధనంజయ్ చేసుకోబోయే ధన్యత విషయానికొస్తే చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమలో మారింగి. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)