AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
పుష్ప -2 క్రేజ్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అల్‌టైమ్ రికార్డ్స్ బ్రేక్!
Published on Mon, 12/16/2024 - 18:38
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్క్‌ను అధిగమించింది.
సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా నార్త్‌లోనూ తగ్గేదేలే అంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఎప్పుడు లేని విధంగా రూ.561 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్‌లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది.
(ఇది చదవండి: పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల)
కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..
ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మూవీ వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4— Pushpa (@PushpaMovie) December 16, 2024
Tags : 1