'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం

Published on Wed, 06/18/2025 - 08:01

'పుష్ప 2' సినిమా పేరు చెప్పగానే రికార్డులే గుర్తొస్తాయి. ఎందుకంటే థియేటర్లలో రిలీజై ఏకంగా రూ.1800 కోట్ల మేర వసూళ్లు సాధించి హయ్యస్ట్ గ్రాసర్‌ మూవీస్‌లో ఒకటిగా నిలవగా.. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్‌లో కొనసాగింది. ఇప్పటికీ పలు షోలు, ప్రోగ్రామ్స్‌లోనూ పుష్పరాజ్ పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్‌లో మరో సంచలనానికి ఈ మూవీ కారణమైంది.

తొలుత థియేటర్లలో, తర్వాత ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న పుష్ప 2.. ఇప్పుడు బుల్లితెరపై కూడా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేయగా.. ఏకంగా దేశవ్యాప్తంగా 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. థియేటర్లతో పాటు టీవీల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న 'స్త్రీ-2' సహా చాలా హిందీ చిత్రాల్ని టీఆర్పీ విషయంలో 'పుష్ప-2' దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)

అలానే 5.4 కోట్ల హిందీ జనాలు ఈ సినిమాని చూసినట్లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే కాదు జూన్ 29న అంటే ఆదివారం రీలోడెడ్ హిందీ వెర్షన్‌ని టీవీలో ప్రసారం చేయనున్నారు. ఈసారి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో కాకపోయినా సరే కొన్నాళ్ల తర్వాత అయినా సరే 'పుష్ప 3' తీయడం గ్యారంటీ. ఎందుకంటే పుష్ప అంటే సినిమా పేరు కాదు. నార్త్‌లో అదో బ్రాండ్ అయిపోయింది.

బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదివరకే దీపికా పదుకొణెని హీరోయిన్‌గా ప్రకటించగా మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఈ మూవీలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం ఓ చోట మాట్లాడిన డైరెక్టర్ అట్లీ.. దేశంలోనే ఇది ఖరీదైన చిత్రమని చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీతో అల్లు అర్జున్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)