Breaking News

'పుష్ప2' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. బాలీవుడ్‌ కింగ్‌గా అల్లు అర్జున్‌

Published on Fri, 12/06/2024 - 16:15

తెలుగు సినిమాల ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాయి.  హిందీ సినిమాలు కూడా ఆ టార్గెట్‌ను అందుకోవాలంటే కాస్తా కష్టమే అనేలా ఉన్నాయి. బాలీవుడ్‌లో పుష్ప2 కలెక్షన్స్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాయి. ఈమేరకు చిత్ర యూనిట్‌ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌,సల్మాన్‌ఖాన్‌ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కానీ రికార్డ్‌ అల్లు అర్జున్‌ క్రియేట్‌ చేశాడు.

బాలీవుడ్‌లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా షారుఖ్‌ఖాన్‌ 'జవాన్‌' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. హిందీలో ఫస్ట్‌ డే రూ.72 కోట్ల నెట్‌ రాబట్టి ఫస్ట్‌ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్‌ ఫస్ట్‌ కలెక్షన్స్‌ టాప్‌  టెన్‌ లిస్ట్‌లో పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. ఆ తర్వాతే టాలీవుడ్‌ నుంచి బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్‌ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.

బాలీవుడ్‌లో ఫస్ట్‌ డే అత్యధిక కలెక్షన్స్‌ 
1. పుష్ప2 ( రూ. 72 కోట్ల నెట్‌)
2. జవాన్‌ (రూ. 65.5 కోట్ల నెట్‌)
3. స్త్రీ2 ( రూ.55 కోట్లు)
4. పఠాన్‌ ( రూ. 55 కోట్లు)
5. యానిమల్‌ ( రూ.54.75 కోట్లు)
6. కేజీఎఫ్‌2 ( రూ.53.95 కోట్లు)
7. వార్‌ (రూ. 51.60 కోట్లు)
8. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ ( రూ. 50 కోట్లు)
9. సింగం ఎగైన్‌ (రూ. 43.5 కోట్లు)
10. టైగర్‌3 (రూ.43 కోట్లు)
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)