Breaking News

పుష్పరాజ్‌ ఊచకోత.. అత్యధిక వసూళ్లతో ఆల్‌ టైమ్ రికార్డ్!

Published on Mon, 12/09/2024 - 14:49

ఇటీవల థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐకాన్ ‍స్టార్ మూవీ తొలిరోజే ఏకంగా రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ‍ప్రస్తుతం మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల కలెక్షన్స్‌తో పుష్పరాజ్‌ దూసుకెళ్తున్నాడు.

నార్త్‌లో వసూళ్ల ఊచకోత..

ఇక హిందీ విషయానికొస్తే మొదటి రోజే అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డ్ సాధించింది. మొదటి రోజే ఏకంగా రూ.72 కోట్ల వసూళ్ల షారూఖ్ ఖాన్‌ సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లతో తన రికార్డ్‌ను తానే తిరగరాశాడు. ఇక నాలుగోరోజు ఆదివారం కావడంతో అన్ని రికార్డులు బద్దలయ్యాయి. ఏకంగా రూ.86 కోట్ల నెట్ వసూళ్లతో ప్రభంజనం సృష్టించాడు పుష్పరాజ్. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.291 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. హిందీలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇప్పటికే జవాన్, పఠాన్, యానిమల్, గదర్- 2 సినిమాలను అధిగమించింది. డిసెంబర్ 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే పలు రికార్డులను బద్దలు కొట్టింది. 

పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులు

అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్:

పుష్ప 2 హిందీ వర్షన్ భారతదేశంలో రూ. 72 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల వసూళ్లను రాబట్టిన షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని అధిగమించింది.

అత్యధిక నాన్-హాలిడే ఓపెనింగ్:  నాన్ హాలీడే గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓ ప్రత్యేక మైలురాయిని సాధించింది.

అత్యధిక నాన్-ఫెస్టివల్ ఓపెనింగ్:  ఈ మూవీ విడుదల సమయంలో ఎలాంటి పండుగ లేకపోయినా ఆల్‌టైమ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలిగింది.

హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్:  హిందీ వెర్షన్‌లో భాగంగా ఇండియాలో కేవలం నాల్గో రోజు(ఒక్క రోజు)  రూ. 86 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టింది.

అత్యంత వేగంగా రూ.250 కోట్లు:  భారతదేశంలో అత్యంత వేగంగా రూ.250 కోట్ల మార్కును అధిగమించిన హిందీ వర్షన్‌ చిత్రంగా పుష్ప- 2 నిలిచింది.  డిసెంబర్ 8 (ఆదివారం) నాడు ఈ మైలురాయిని సాధించింది.

అత్యధిక వీకెండ్‌ ఒపెనింగ్: పుష్ప 2 హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 291 కోట్ల నెట్ వసూళ్లు ఆర్జించింది.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)