Breaking News

'హాయ్‌ నాన్న' కాపీ సినిమా.. నాని ఇంత చీపా?: కన్నడ నిర్మాత

Published on Thu, 01/30/2025 - 15:45

నేచురల్‌ స్టార్‌ నాని (Nani) హీరోగా నటించిన హాయ్‌ నాన్న సినిమా (Hi Nanna Movie) బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. రూ.75 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 2023 డిసెంబర్‌లో విడుదలైంది. శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య (Pushkara Mallikarjunaiah) సంచలన ఆరోపణలు చేశాడు. తన సినిమా కథను దొంగిలించారని ఆరోపించాడు. 

తాను తెరకెక్కించిన భీమసేన నలమహారాజ మూవీ ఒరిజినల్‌ స్టోరీ అని.. తమ అనుమతి లేకుండా హాయ్‌ నాన్న పేరిట తెలుగులో రీమేక్‌ చేశారని మండిపడ్డాడు. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తావనుకోలేదంటూ హీరో నానిని ట్యాగ్‌ చేశాడు. దీంతో హాయ్‌ నాన్న సినిమా టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఒరిజినల్‌ కథ అని నమ్మించారు, తెలుగు ఇండస్ట్రీ తలదించుకునేట్లు చేస్తున్నారు కదా.. తిట్టిపోస్తున్నారు.

భీమసేన మూవీ ఎప్పుడొచ్చింది?
భీమసేన నలమహారాజ సినిమా (Bheemasena Nalamaharaja Movie) విషయానికి వస్తే ఇది కన్నడ చిత్రం. కార్తీక్‌ సరగుర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్‌ అయ్యర్‌, ఆరోహి నారాయణ్‌, ప్రియాంక, ఆద్య, అచ్యుత్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. చరణ్‌ రాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం 2020 అక్టోబర్‌లో డైరెక్ట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ మూవీని హీరో రక్షిత్‌ శెట్టితో పాటు పుష్కర మల్లికార్జునయ్య, హేమంత్‌ ఎమ్‌ రావు నిర్మించారు. మల్లికార్జునయ్య.. కిరిక్‌ పార్టీ, గోధీ బన్నా సాధారణ మైకట్టు, హంబుల్‌ పొలిటీషియన్‌ నోగరాజ్‌, జీరిజింబె, అవతార పురుష, 10 వంటి పలు చిత్రాలను నిర్మించాడు.

చదవండి: మొన్న హీరోయిన్‌ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు