Breaking News

'నిజమైన కరెన్సీ అదే'.. పూరి జగన్నాధ్‌ సందేశం విన్నారా?

Published on Mon, 04/27/2026 - 17:46

టాలీవుడ్ మాస్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే పూరి జగనాధ్‌ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైఫ్‌ పాఠాలు చెబుతుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పూరి రిలీజ్‌ చేసిన వీడియో మన టైమ్, మనీ గురించి మాట్లాడారు. ప్రతి రోజు మనం ఖర్చు చేస్తున్న సమయం గురించి వివరించారు. లైఫ్‌లో డబ్బు మాత్రమే ఇంపార్టెంట్‌ కాదని సందేశమిచ్చారు. గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఏం చేసినా తిరిగి తీసుకురాలేమని అన్నారు.  రియల్‌ కరెన్సీ పేరుతో పూరి ఏమన్నారో మీరు కూడా చదివేయండి.

'అందరికీ దేవుడు ఇచ్చింది రోజుకి 24 గంటలు మాత్రమే. ఎన్ని గంటలు ఉన్నాయన్నది కాదు.. ఆ 24 గంటలు ఎలా ఖర్చు చేశామన్నదే ముఖ్యం. మనం ప్రతి రోజు డబ్బు కోసం రాత్రి, పగలు కష్టపడతాం. ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డబ్బు కంటే విలువైన సమయాన్ని మాత్రం పట్టించుకోం. టైం గురించి వివరంగా చెప్పాలంటే.. ప్రతి ఉదయం మన పర్సు టైంతో నిండిపోయి ఉంటుంది. రాత్రి అయ్యేసరికి నువ్వు ఏం చేసినా.. చేయకపోయినా ఖర్చు అయిపోతుంది. మళ్లీ ఉదయం చూసుకుంటే పర్సు నిండా 24 గంటలు నిండే ఉంటాయి'  అని అన్నారు.

'నువ్వు టైమ్‌ను వేస్ట్ చేసినా కరిగిపోతుంది.. తెలివిగా ఇన్వెస్ట్ చేసినా అయిపోతుంది. ఈ రెండింటిలో మనం ఏం చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎన్నేళ్లు కష్టపడినా పర్లేదు.. ఏదో రోజు బోలెడంత డబ్బు సంపాదించి మిగిలిన జీవితమంతా హ్యాపీగా బతుకుదామనుకుంటాం. బాగా సంపాదించిన తర్వాత ఎంజాయ్‌ చేయడానికి టైముండదు. అందుకే అదే రియల్ కరెన్సీ. డబ్బు మాయలో పడి కుటుంబంతో గడిపే అరుదైన క్షణాలు కోల్పోతాం. మిత్రులతో గడిపే అందమైన సాయంత్రాలు మిస్ అవుతాం'

'ఒక రోజులో మన నాలుగు గంటలు ట్రాఫిక్.. మరో నాలుగు గంటలు చిరాకులో గడిచిపోతాయి. మిగతావి నిద్రకు కేటాయిస్తాం. ఈరోజు కాకపోతే రేపు గుడ్‌న్యూస్‌ వింటామని ఎదురు చూస్తూ నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా మన జీవితంలో ఎంత పోగొట్టుకున్నామో కరిగిపోయిన కాలమే సమాధానం చెబుతుంది. ఈ భూమ్మీద మనకి లిమిటెడ్ అవర్స్ ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ప్రాణం వదిలేస్తాం. అందుకే వీలైనన్ని మధుర క్షణాలు మన అకౌంట్‌లో పడితేనే పుట్టినందుకు.. ఇక్కడ గడిపినందుకు ఏదో ఓ మీనింగ్ అంటూ ఉంటుంది. లేకపోతే ఈ జర్నీ మొత్తం నాశనమైపోద్ది' అంటూ సమయం విలువను కరెన్సీతో పోలుస్తూ సందేశమిచ్చారు మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.

 

Videos

కవిత పార్టీపై కేటీఆర్ రియాక్షన్

ఘోర ప్రమాదం కార్మికులపై కూలిన క్రేన్

TDP చేసే రాజకీయాల కన్నా, ప్రాస్టిట్యూట్ చేసుకునే మహిళా చాల బెటర్

కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే..? బూడిదైన కార్లు..!

శవాన్ని ఎంత అలంకరించినా లేచి నిలబడదు..!

పోలీస్ వ్యవస్థ బతికే ఉంటే రాధాకృష్ణపై ఫిర్యాదు తీసుకోవాలి

కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్లు.. లక్షకు 5 లక్షలొచ్చాయ్..

తేజస్వీ సూర్య ఒక వెదవ

అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Photos

+5

‘వదలా’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్‌ (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న మానస చౌదరి (ఫొటోలు)

+5

ఏపీకి కూటమి శాపం.. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఇక్కడేందుకు? (ఫొటోలు)

+5

‘ఏక్‌ దిన్‌’ మూవీ మ్యూజికల్‌ ఈవెంట్‌లో సాయి పల్లవి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్‌ ఈవెనింగ్‌ (ఫొటోలు)

+5

హనీ ఈజ్‌ ది బెస్ట్‌.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్‌ (ఫోటోలు)

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)