సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్
Breaking News
ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం, సింగర్ దుర్మరణం
Published on Thu, 09/01/2022 - 18:50
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. మెల్‌బోర్న్‌లో బుల్లా డిగ్గర్స్ రెస్ట్ రోడ్డు వద్ద 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన కారు క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మృతి చెందగా.. ఘటనకు కారణమైన 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. నిర్వేయర్ సింగ్ తాను పని చేస్తున్న కార్యాలయానికి కారులో బయలుదేరారు. మెల్‌బోర్న్‌లోని బుల్లా డిగ్గర్స్ రోడ్డు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనక నుంచి ఢికొట్టింది.
చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్
ఈ ఘటనలో ఆయన కారు పూర్తిగా ధ్వంసం కాగా నిర్వేయర్ సింగ్ ఘటన సమయంలో మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. పంజాబ్‌కు చెందిన నిర్వేయర్ సింగ్ సింగింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు 9 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన పంజాబీ సింగర్‌గా, ర్యాపర్‌గా మంచి గుర్తింపు పొందారు. ఆయన పాడిన పలు పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి కూడా. ఇక ఆయన మృతిపై ఫ్యాన్స్, ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
చదవండి: యువ నటి ఆత్మహత్య.. వైరల్‌గా మారిన సూసైడ్ నోట్
Tags : 1