Breaking News

కొత్త కారు కొన్న స్టార్‌ హీరో సతీమణి.. ధర ఎంతో తెలిస్తే

Published on Sun, 03/31/2024 - 13:19

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి మూడేళ్లు కావస్తుంది. ఆయన మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఆయన సతీమణి అశ్విని తన భుజాన వేసుకున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల హోస్పేటలో జరిగిన 'యువ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సగంలో వదిలేసిన పనులను అశ్విని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన పిఆర్‌కె ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పలు సినిమాలు నిర్మాణరంగంలో ఉన్నాయి. ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్‌లను ఆమె కొనసాగిస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ క్రంమలో నిర్మాత అశ్విని పునీత్ రాజ్‌కుమార్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పునీత్‌కు కూడా కారు, బైక్స్‌ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు AudiQ7 కారు  ఆ జాబితాలో చేరింది. ఈ రోజుల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఆడి క్యూ7 ఇతర కార్ల కంటే డిజైన్, లుక్స్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ తదితర అంశాల్లో చాలా భిన్నంగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇది లీటర్ పెట్రోల్‌కు 14 కి.మీల మైలేజీని కూడా ఇస్తుంది. క్షణాల్లో 250 KMPH స్పీడ్‌ను అందుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఆడి క్యూ7 కారు ఆన్-రోడ్ ధర రూ.1 కోటి 10 లక్షల వరకు ఉంటుంది.

2019లో మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న భార్య అశ్వినికి రూ. 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బ‌హుమ‌తిగా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశాడు పునీత్‌. అంతకు ముందు కూడా జాగ్వార్ కారుని త‌న భార్య‌కి గిఫ్ట్‌గా పునీత్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశ్విక కొన్న కారు ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)