Breaking News

ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను దాటేయనుందా?

Published on Tue, 06/27/2023 - 19:27

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం  మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ విమర్శల పాలైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. డైలాగ్స్, పాత్రలతో పాటు సీత ఇండియాలో జన్మించినట్లు చూపించడం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. తొలి మూడు రోజులు వసూళ్లు సాధించినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఈ చిత్రం కోసం  దాదాపుగా రూ.600 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది.  

(ఇది చదవండి: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని హీరోయిన్‌ ఎవరో తెలుసా?)

ఇక ప్రభాస్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్-కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి  అగ్రతారలు నటిస్తున్నారు. అంతేకాకుండా సీతారామం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

అయితే ఇంతటి భారీ తారగణంతో రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్‌పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. భారీస్థాయిలో గ్రాఫిక్స్‌ ఉండనుండడంతో ఈ మూవీ బడ్జెట్‌ రూ. 600 కోట్లకు పైగానే ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అదే గనుక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ప్రాజెక్ట్-కె నిలవనుంది. 

ప్రాజెక్ట్-కె రెమ్యూనరేషన్స్

ప్రాజెక్ట్- కె కోసం ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఎంత తీసుకుంటున్నారనే దానిపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ప్రభాస్ ఈ చిత్రం కోసం రూ.150 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కమల్ హాసన్ ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రకే రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీపికా పదుకొణె ఈ చిత్రానికి రూ. 10 కోట్లు వసూలు చేస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీతో కలిపి ఇతరులకు మరో రూ.20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. దీంతో కేవలం  ప్రాజెక్-కె రెమ్యూనరేషన్‌ కోసమే దాదాపు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం  సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2024న విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

(ఇది చదవండి: ఆదిపురుష్‌.. సెన్సార్‌ బోర్డుపై హైకోర్టు ఫైర్‌)

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)