Breaking News

‘మన శంకరవరప్రసాద్‌’ కి సీక్వెల్‌ ఉందా?

Published on Tue, 01/06/2026 - 15:47

ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా  ప్రతి సినిమా చివరన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్‌గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే పార్ట్‌లో చూపించలేక.. రెండో భాగం తెరకెక్కిస్తుంటే..మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్‌ని ప్రకటిస్తున్నారు. కథ రేడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్‌ ప్రకటిస్తారు. సినిమా హిట్‌ అయితే..అప్పడు కథని డెవలప్‌ చేస్తారు. ఒకవేళ  ప్లాప్‌ అయితే.. సీక్వెల్‌ ప్రకటించినప్పటికీ..మళ్లీ దాని జోలికి వెళ్లరు. అలా ఎన్నో సినిమాల సీక్వెల్స్ ఆగిపోయాయి. అయినా కూడా సీక్వెల్‌ ప్రకటించడం మాత్రం ఆగడం లేదు. 

చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’కి కూడా సీక్వెల్‌ ఉంటుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ లేదని స్పష్టం చేశారు. 

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు సాహు, సుస్మిత తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మన శంకర్‌ వరప్రసాద్‌’కి సీక్వెల్‌ ఉంటుందా? అని ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇది కంప్లీట్‌ ఎండింగ్‌ మూవీ. క్లైమాక్స్‌లో పార్ట్‌ 2 ప్రకటన ఏమి ఉండదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని స్పష్టం చేశారు.

మనశంకర్‌ వరప్రసాద్‌ విషయానికొస్తే.. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న  ఈ చిత్రం విడుదల కాబోతుంది. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)