Breaking News

రిస్క్‌ తీసుకునేంతలా కథ నచ్చింది: నిర్మాతలు ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి

Published on Sun, 11/02/2025 - 00:16

‘‘కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలంటే సినిమాలో మంచి కంటెంట్‌ ఉంటేనే సాధ్యమౌతోంది. దీంతో థియేట్రికల్‌గా బాగుంటాయనుకునే కథలనే ఎంపిక చేసుకుంటున్నాం. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ థియేట్రికల్‌ మూవీ. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది’’ అని అన్నారు నిర్మాత ధీరజ్‌ మొగిలినేని. రష్మికా మందన్నా లీడ్‌ రోల్‌లో, దీక్షిత్‌ శెట్టి మరో లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘రిస్క్‌ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా స్టోరీ నచ్చింది. ఈ చిత్రం హీరోయిన్‌ కోణంలో ఉంటుంది... అంతే. కన్నడ మార్కెట్‌ కోసం దీక్షిత్‌ను తీసుకోలేదు. అతను మంచి పెర్ఫార్మర్‌ అనే తీసుకున్నాం. రాహుల్‌ చేసిన గత సినిమాల గురించి మేం ఆలోచించలేదు. రాహుల్‌ రాసిన ఈ కథ నచ్చి, ఈ సినిమా చేశాం. పారితోషికం తీసుకోకుండానే రష్మిక ఈ సినిమా చేశారు. ఆ కృతజ్ఞతతో ఆమెకు రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం.

ఇక ఈ చిత్రంలో అను ఇమ్మాన్యూయేల్‌ ప్రాధాన్యం ఉన్న అతిథి పాత్ర చేశారు. నిర్మాత విద్య, నేను సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటాం. ఈ చిత్రాన్ని మేమే సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాం. అల్లు అరవింద్‌గారు మాకు మంచి సపోర్ట్‌గా ఉంటారు’’ అని అన్నారు. మరో నిర్మాత విద్య కొప్పినీడి మాట్లాడుతూ– ‘‘కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’  రెగ్యులర్‌ సినిమా కాదు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం.

దర్శకుడిగా రాహుల్‌కు జాతీయ అవార్డు రావొచ్చనే ప్రశంసలు సెన్సార్‌ వారి నుంచి వచ్చాయి. ఈ చిత్రంలోని నాలుగు పాటలు, రెండు బిట్‌ సాంగ్స్‌కి హేషమ్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు ఓ ప్రాజెక్ట్‌ను టేకప్‌ చేయడం అంత సులువైన పని కాదు. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించి, సినిమాలు చేయాల్సి వస్తోంది. అరవింద్‌గారు ఇచ్చే సలహా కూడా ఇదే’’ అని చెప్పారు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)