Breaking News

ఆ రెండు సినిమాల్లో ఒక్క చోట కూడా బోర్‌ కొట్టదు..ఇది నా సవాల్‌: నిర్మాత

Published on Tue, 08/26/2025 - 11:44

‘‘త్రిబాణధారి బార్బరిక్‌’ చాలా కొత్త కథ.. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అని నిర్మాత విజయ్‌పాల్‌ రెడ్డి అడిదల అన్నారు. సత్య రాజ్, ఉదయ భాను, వశిష్ట ఎన్‌ సింహా, సత్యం రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో విజయ్‌ పాల్‌ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. 

విజయ్‌పాల్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘మోహన్‌ చెప్పిన ‘త్రిబాణధారి బార్బరిక్‌’ కథ నచ్చడంతో సినిమా ఆరంభించాం. నేను ఇండస్ట్రీ కొత్త.. దీంతో డైరెక్టర్‌ మారుతిగారు అండగా నిలిచారు. ఇన్‌ఫ్యూజన్‌ బ్యాండ్‌ వారు మంచి పాటలు, ఆర్‌ఆర్‌ ఇచ్చారు. రమేష్‌ రెడ్డి విజువల్స్‌ మెప్పిస్తాయి. నైజాంలో మైత్రీవారు మా సినిమా రిలీజ్‌ చేస్తున్నారు.

 వరంగల్‌లో ప్రదర్శించిన మా చిత్రం స్పెషల్‌ ప్రీమియర్‌ షోలో ఓ జంట ఉచితంగా చూశారు. అయితే, ఇది ఫ్రీగా చూడాల్సిన చిత్రం కాదంటూ వాళ్లు తిరిగి డబ్బులు ఇచ్చారు.. అది చూసిన తర్వాత నాకు ఎంతో సంతృప్తిగా అనిపించింది. ‘త్రిబాణధారి బార్బరిక్‌’ తో పాటుగా ‘బ్యూటీ’ సినిమా నిర్మించాను. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క చోట కూడా బోర్‌ కొట్టదు.. ఇది నా సవాల్‌’’ అని చెప్పారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)