శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్
Breaking News
'మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి.. అంతే కానీ'.. శివాజీకి టాలీవుడ్ నిర్మాత కౌంటర్
Published on Sun, 12/28/2025 - 11:02
టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హీరోయిన్ల డ్రెస్సులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ యావత్ మహిళా లోకం ఒక్కసారిగా విరుచుకుపడింది. సినీతారలతో పాటు సామాన్యులు సైతం శివాజీపై విమర్శలు చేశారు. ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై వల్గర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత తాను ఆ రెండు పదాలు మాత్రమే వాడకుండా ఉండాల్సిందని సారీ చెబుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇటీవల శివాజీ కామెంట్స్‌పై కేవలం మహిళలు మాత్రమే కాదు.. నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, నటుడు ప్రకాశ్ రాజ్ శివాజీ కామెంట్స్‌పై స్పందించారు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.
తాజాగా శివాజీ కామెంట్స్‌పై నిర్మాత ఎస్కేఎన్ తనదైన స్టైల్లో పంచ్‌లు వేశారు. పతంగ్ మూవీ సక్సెస్ మీట్‌కు హాజరైన ఎస్కేఎన్ హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడే హీరోయిన్ను చూసి మామూలు డ్రెస్ వేసుకొచ్చారేంటి?..మన తెలుగు అమ్మాయి కాస్తా గ్లామర్‌గా రావాల్సిందన్నారు. మన తెలుగు హీరోయిన్స్, తెలుగమ్మాయిలు మీకు ఏ డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే అదే వేసుకోండి.. ఏది కాన్ఫిడెంట్‌గా అదే వేసుకోండని అన్నారు. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన పని లేదన్నారు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే బాగుంటామని.. మన ఇంటెన్షన్ బాగుంటే అంతా మంచే జరుగుతుంది.. అంతే తప్ప మన డ్రెస్సుల్లో ఉండదని పరోక్షంగా శివాజీకి కౌంటరిచ్చారు ఎస్కేఎన్.
#Counter
ఎ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటె వేసుకోండి
ఎ డ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉంటే వేసుకోండి.
ఎ బట్టల సతి గాడి మాట వినకండి!!
- #SKN @ #Patang Event pic.twitter.com/ye0Knl85uQ— Telugu Bit (@Telugubit) December 27, 2025
Tags : 1