Breaking News

'రామ్‌చరణ్‌ ఒప్పుకోకుంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు'.. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి

Published on Wed, 07/02/2025 - 17:54

మెగా హీరో రామ్ చరణ్ వివాదంపై  దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. గేమ్ ఛేంజర్ కోసం చరణ్ మాకు పూర్తిగా సహకరించారని తెలిపారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని విడుదల చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌ వివాదంగా మారడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.

నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..'మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్‌వీసీ సంస్థకు, రామ్ చరణ్‌కు అవినాభావ సంభంధం ఉంది. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న మాట దొర్లినా రామ్ చరణ్‌కు, అభిమానులకు నా క్షమాపణలు. నేను అన్న ఉద్దేశం కాదు. మాకు మెగా హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి వాళ్లను నేను అవమానించేంత ముర్ఖుణ్ణి కాదు. రామ్ చరణ్ వల్లే సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశాం. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అంటాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చేలా ప్రవర్తించకండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి. త్వరలోనే రామ్ చరణ్‌తో మరో సినిమా చేయబోతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

Videos

ఆఫ్రికాలో మరో ఇద్దరు భారతీయులు బలి

ముద్రగడ కుమారుడికి వైఎస్ జగన్ ఫోన్.. తండ్రి ఆరోగ్యంపై ఆరా

117 ఏళ్ల చరిత్ర ఉన్న లాల్ దర్వాజా బోనాలు

CEO చిలక్కొట్టుడు.. లైవ్ లో అడ్డంగా బుక్కైపోయాడు..

లిక్కర్ స్కాం అనేది చంద్రబాబు హయాంలో జరిగింది: సజ్జల

స్పిరిట్ కోసం పూర్తిగా మారిపోయిన ప్రభాస్ లుక్..!

పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు లక్ష్యం

మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై పెద్దిరెడ్డి రియాక్షన్

మమల్ని ఆపడానికి మీరెవరు.. పోలీసులపై లాయర్లు ఫైర్

సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Photos

+5

మెగా కోడలు ఉపాసన బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 20-27)

+5

హైదరాబాద్ లో ఘనంగా బోనాలు (ఫొటోలు)

+5

వరంగల్‌లో సినీనటి నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా.. (ఫొటోలు)

+5

డస్కీ బ్యూటీ బ్రిగిడ.. చుడీదార్‌లో ఇలా (ఫొటోలు)

+5

యూట్యూబ్‌లో ట్రెండింగ్.. రష్మిక 'నదివే' సాంగ్ HD స్టిల్స్ (ఫొటోలు)

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)