Breaking News

ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది : నిర్మాత

Published on Sun, 09/07/2025 - 08:03

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటించిన హారర్‌ మిస్టరీ మూవీ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించారు. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సాహు గారపాటి మాట్లాడుతూ– ‘‘హారర్‌ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే మా ‘కిష్కింధపురి’ చిత్రం మాత్రం వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్, దాని చుట్టూ ఉండే హారర్‌ ఎలిమెంట్స్, రేడియోతో దెయ్యానికి ఉన్న కనెక్షన్‌ ఇవన్నీ మా సినిమాలో కొత్తగా ఉంటాయి. ఇలాంటి హారర్‌ థ్రిల్లర్‌ ఇప్పటివరకు రాలేదు. కొన్ని షాకింగ్, సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా సినిమాలో ఉన్నాయి. 

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌గారి ప్రెజెన్స్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలోని పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమా కథ అనుకున్నప్పుడే అనుపమను హీరోయిన్‌గా అనుకున్నాం. అనుపమ మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఈ చిత్రం కోసం నెల రోజులు కష్టపడి, దాదాపు రూ. 2 కోట్లతో ఓ రేడియో స్టేషన్‌ సెట్‌ వేశాం. సినిమాలోని కీలక సన్నివేశాలు ఇక్కడే జరుగుతాయి. తొలి భాగం వినోదాత్మకంగా, సెకండాఫ్‌లో సీరియస్‌ హారర్‌ ఫిల్మ్‌గా టర్న్‌ అవుతుంది. 

‘కిష్కింధపురి’ అనే ఊర్లో జరిగే కథ కనుక ‘కిష్కింధపురి’ అని టైటిల్‌ పెట్టడం జరిగింది. మా సినిమా థియేటర్స్‌లో ఆడియన్స్‌ను తప్పక ఎంగేజ్‌ చేస్తుంది. హాలీవుడ్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాన్‌– థియేట్రికల్‌ రైట్స్‌ విషయంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. 

ఓటీటీ డీల్స్‌ కుదరని కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్‌ ఆగిపోతున్నాయి. సినిమాల రిలీజ్‌ డేట్స్‌ ప్రభావితం అవుతున్నాయి. చూస్తుంటే ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది. ఇక సినీ కార్మికుల సమ్మె ప్రభావం మా బ్యానర్‌లో (ఈ సినిమాకు సుస్మితా కొణిదెల మరో నిర్మాత) నిర్మిస్తున్న చిరంజీవిగారి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమాపై పడింది. కానీ ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్‌ చేస్తాం. కాకపోతే అక్టోబరులో షూటింగ్‌ పూర్తి చేయాలనుకున్నాం. కానీ నవంబరు కల్లా పూర్తి చేస్తాం. ఓ పదిహేను రోజులు తేడా అంతే’’ అని అన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)