Breaking News

హీరో లేడీ గెటప్‌ వేస్తే హిట్టే: నిర్మాత సాహు గారపాటి

Published on Sun, 02/09/2025 - 03:25

‘‘హీరో లేడీ గెటప్‌ వేసిన ‘భామనే సత్యభామనే, మేడమ్‌’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించి, హిట్స్‌గా నిలిచాయి. ఈ సెంటిమెంట్‌తో ‘లైలా’(Laila) మూవీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో ఈ తరహా సినిమాలు వచ్చి కూడా చాలా కాలం అయింది. దీంతో ‘లైలా’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు నిర్మాత సాహు గారపాటి. విశ్వక్‌ సేన్‌(Vishwak Sen) హీరోగా నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘లైలా’. ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కామాక్షీ భాస్కర్ల, అభిమన్యు సింగ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో నిర్మాత సాహు గారపాటి(Producer Sahu Garapati) మాట్లాడుతూ– ‘‘యూత్‌ టార్గెట్‌గా చేసిన ‘లైలా’ని ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్‌ (లైలా) కూడా చేశారు. ఈ క్యారెక్టర్‌ కోసం ముందుగా కొందరు హీరోలను అనుకున్నాం. విశ్వక్‌ ఈ కథ వినగానే ‘ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్‌’ అన్నారు.

హీరో  తొలి భాగం సోనూగా, రెండో భాగం లైలాగా మారతాడు. లైలాగా హీరో ఎందుకు మారాడు? అనేది ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ప్రస్తుతం నిర్మాత పరిస్థితి ఏమీ బాగోలేదు. అనుకున్న బడ్జెట్‌లో సినిమాను నిర్మించగలిగితే ఓకే. ‘లైలా’ని అనుకున్న బడ్జెట్‌లోనే తీశాం. చిరంజీవిగారితో అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో మేం చేయనున్న నెక్ట్స్‌ మూవీ జూన్‌ లేదా జూలైలో ప్రారంభం అవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది’’ అని అన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)