ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం
Published on Tue, 05/05/2026 - 19:08
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించిన ఆయన పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో రాజా, సూర్యవంశం , సుస్వాగతం, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.
అంతేకాకుండా తెలుగులో నిన్నే ప్రేమిస్తా, గోరింటాకు, అన్నవరం, గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించారు. తమిళ హీరో విజయ్‌తో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. విజయ్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగులో చివరిసారిగా చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాని నిర్మించారు.
అర్‌బీ చౌదరి సినీ ప్రస్థానం..
ఆయన పూర్తి పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. మొదట మలయాళం సినిమాలతో నిర్మాతగా ప్రవేశం చేశారు. 1989లో తమిళ సినిమాల్లో ప్రవేశించి, "సూపర్" బ్యానర్ కింద సినిమాలు నిర్మించారు. అటు తరువాత "గుడ్ నైట్" బ్రాండ్ నుండి "గుడ్" అనే పదాన్ని తీసుకుని, "సూపర్ గుడ్ ఫిల్మ్స్" అనే పేరుతో స్వతంత్రంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
ఆయన జన్మించింది తమిళనాడులోని చెన్నై. ఆయనకు నలుగురు కుమారులున్నారు. జీవన్(స్టీల్ కంపెనీ యజమాని), జితన్ రమేష్ (నటుడు, నిర్మాత),సురేష్(నిర్మాత), జీవా(ప్రముఖ నటుడు).
సూపర్ గుడ్ ఫిల్మ్స్ దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఆయన కుమారులు, ముఖ్యంగా జీవా మరియు జితన్ రమేష్, సినీ పరిశ్రమలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్మించిన సినిమాలు కుటుంబ విలువలు, భావోద్వేగాలు, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తూ, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్
1990 – బెస్ట్ ఫిల్మ్ (తమిళం) –వసంతం
1999 – బెస్ట్ ఫిల్మ్ (తెలుగు) – రాజా
2001 – బెస్ట్ ఫిల్మ్ (తమిళం) – ఆనందం
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్:
నాటామై (1994), సూర్యవంశం (1997), తుల్లాధ మనముమ్ తుల్లుం (1999) వంటి చిత్రాలకు ఉత్తమ చిత్ర అవార్డులు.
Tags : 1