Breaking News

డైరెక్టర్‌కు బంపరాఫర్.. నీ సొంతింటి బాధ్యత నాదే: టాలీవుడ్ నిర్మాత

Published on Wed, 11/05/2025 - 16:07

రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. ఈ మూవీలో రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మూవీ నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాహుల్ రవీంద్రన్‌ తనతో ఓ మాట అన్నారని తెలిపారు. ఈ మూవీ సూపర్ హిట్‌ అయితే నెక్ట్స్‌ మూవీకి ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుని ఓ ఇల్లు కొనుక్కుంటానని నాతో చెప్పారని అన్నారు. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌కు హైదరాబాద్‌లో ఇప్పటివరకు సొంతిల్లు లేదన్నారు. ఈ సినిమా హిట్‌ అయితే నేనే మీ ఇంటి కలను నెరవేరుస్తానని నిర్మాత ధీరజ్ మొగిలినేని హామీ ఇచ్చారు.

కాగా.. ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)