Breaking News

అక్కా తమ్ముళ్లు సెట్స్‌లో ఉండకూడదు: దీప్తి గంటా

Published on Fri, 03/14/2025 - 02:07

‘‘కోర్ట్‌’ సినిమా నచ్చకపోతే, తాను హీరోగా నటించిన ‘హిట్‌ 3’ సినిమా చూడొద్దని నానిగారు వేదికపై మాట్లాడినప్పుడు మేం షాక్‌ అయ్యాం. కానీ నాని అలా అన్నారంటే.. ‘కోర్ట్‌’ సినిమాపై నమ్మకం ఉంది కాబట్టే అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగారు. పైగా రెండు (కోర్ట్, హిట్‌ 3) సినిమాలకూ నానీయే ఓ నిర్మాత... సోప్రాబ్లమ్‌ లేదు’’ అని అన్నారు దీప్తి గంటా.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో, రోషన్, శ్రీదేవి, శివాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్‌: స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’. రామ్‌ జగదీశ్‌ దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాత.

కాగా ఈ సినిమా విడుదలకు రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. ఈ సందర్భంగా గురువారం  విలేకరుల సమావేశంలో ఈ ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా చెప్పిన విశేషాలు.

‘‘నాని, ప్రశాంతిగారు స్క్రిప్ట్‌ విని ఈ సినిమాను ఓకే చేశారు. ఈ కథ నాకూ నచ్చింది. దర్శకుడు జగదీశ్‌ రాసిన ‘కోర్ట్‌’ కథలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. ఈ సినిమాకు నేను ఆన్‌సెట్‌ ప్రోడ్యూసర్‌గా జాయిన్‌ అయ్యాను. సెట్స్‌కు రోజూ వెళ్లేదాన్ని. జగదీశ్‌ చాలా పరిశోధన చేసి, ఈ సినిమా చేశారు. అందుకే నేచురల్‌గా వచ్చింది.

పోక్సో చట్టం గురించి ఆయన చాలా వివరంగా స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశారు. ఇక మంగపతి క్యారెక్టర్‌లో శివాజీగారు అద్భుతంగా నటించారు. ఇంకా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి... ఇలా ప్రతి పాత్రకు సినిమాలోప్రాముఖ్యత ఉంది. ‘మీట్‌ క్యూట్‌’ తర్వాత నేను యూఎస్‌కి వెళ్లిపోయాను. ఈ సినిమా కోసం మళ్లీ వచ్చాను.

కొన్ని కథలు ఉన్నాయి. భవిష్యత్‌లో మళ్లీ దర్శకత్వం వహిస్తాను’’ అన్నారు దీప్తి. నాని ‘వాల్‌పోస్టర్‌ సినిమా’ బ్యానర్‌లోనే మీ డైరెక్షన్‌ మూవీ ఉండొచ్చా? అన్న ప్రశ్నకు– ‘‘నేను సినిమా చేస్తే నానితో చేయను. అక్కాతమ్ముళ్లు సెట్స్‌లో ఉండకూడదు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు దీప్తి.

నానిగారు పెద్దగా లెక్కలు వేయరు: ప్రశాంతి తిపిర్నేని
‘‘కోర్ట్‌’ సినిమా ప్రీమియర్స్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మేం అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ తరహా జానర్‌లోని మూవీని ఆడియన్స్‌ ఆదరించి, సక్సెస్‌ చేయడం కూడా మంచి పరిణామం. ప్రస్తుతానికి ఈ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాం.

నాని, నేను ఇద్దరం కథలు వింటాం. మా నమ్మకం అంతా నానిగారి జడ్జిమెంట్‌ మీదే ఆధారపడి ఉంటుంది. నానిగారు పెద్దగా లెక్కలేమీ వేయరు. జానర్‌ ఏదైనా కథలో నిజాయితీ ఉండి, డైరెక్టర్‌లో క్లారిటీ ఉంటే చాలు ముందుకు వెళ్తాం. ఒక కథ థియేటర్స్‌లో చూడాలనిపించేలా ఉంటే చాలు... సినిమా చేసేందుకు నానిగారు ఒప్పుకుంటారు. నానిగారి సినిమాలు థియేటర్స్‌కు ముందే ఓటీటీ డీల్స్‌ను పూర్తి చేసుకుంటున్నాయంటే అది కథలపై తనకు ఉన్న జడ్జిమెంటే కారణం. ఇక ‘కోర్ట్‌’లో పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం కావొచ్చనే పాయింట్‌ను దర్శకుడు జగదీశ్‌ అద్భుతంగా చూపించారు’’ అని ప్రశాంతి చెప్పారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)