Breaking News

సమంత.. ఎందుకు ఈ డ్రామాలు? పిచ్చివేషాలు: నిర్మాత

Published on Thu, 04/13/2023 - 20:39

సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు (ఏప్రిల్‌ 14న) ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే!. జ్వరం వచ్చిందని, గొంతు కూడా పోయిందని ట్విటర్‌లో వెల్లడించిందీ హీరోయిన్‌. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మాత్రం అదంతా డ్రామా అంటూ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారి డ్రామాలు వర్కవుట్‌ కాదంటూ మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత సమంత పుష్పలో ఐటం సాంగ్‌ చేసింది. తన బతుకుదెరువు కోసం ఆమె నటించింది. హీరోయిన్‌ స్థాయి నుంచి పడిపోయాక తన చేతికి వచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్లింది. అయినా హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ ముగిసిపోయింది.. గతాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్లడమే! మళ్లీ ఆమెకు స్టార్‌డమ్‌ రాదు. మొన్న యశోద సినిమా సమయంలో ఏడ్చేసి ఆ సినిమాను సక్సెస్‌ చేసుకోవాలనుకుంది.

ఇప్పుడేమో.. నేను చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలనుకున్నా అని చెప్పింది. ఎందుకీ డ్రామాలు? ప్రతిసారి సెంటిమెంట్‌ వర్కవుట్‌ కాదు. కథ, పర్ఫామెన్స్‌ నచ్చితే చూస్తారు. అంతేకానీ అయ్యో పాపం, ఆఖరి కోరిక అన్నట్లుగా మాట్లాడుతోంది అని ఎవరూ చూడరు. ఇవన్నీ పిచ్చివేషాలు. ప్రతిసారి సమంత సెంటిమెంట్‌ డ్రామా క్రియేట్‌ చేస్తోంది. అయినా హీరోయిన్‌ స్థాయి నుంచి కిందకు పడిపోయిన అమ్మాయి శాకుంతలం చిత్రానికి ఎలా సెట్టయిందనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాపై నాకేమాత్రం ఆసక్తి లేదు' అని చెప్పుకొచ్చాడు చిట్టిబాబు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)