Breaking News

అల్లు అర్జున్‌ సినిమాలో యాక్ట్‌ చేశా.. నా భార్య తిట్టింది: నిర్మాత

Published on Thu, 09/04/2025 - 13:15

కొందరు దర్శకనిర్మాతలు కొన్ని సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. ఆర్య సినిమాలో కూడా ఓ డైరెక్టర్‌, ఓ నిర్మాత చిన్న సీన్‌లో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను తాజాగా ఓ ఈవెంట్‌లో ప్రదర్శించారు. అది చూసిన నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) తనలో తానే నవ్వుకున్నాడు. 20 ఏళ్ల కింద షూట్‌ చేసిన ఆ సన్నివేశం తాలూకు జ్ఞాపకాలను షేర్‌ చేసుకున్నాడు. 

నా భార్య తిట్టింది
బన్నీ వాసు మాట్లాడుతూ..  ఆర్య సినిమా చివరి రోజు షూటింగ్‌.. ఆరోజు ముగ్గురు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు రాలేదు. దాంతో దిల్‌ రాజు ఆఫీస్‌ క్యాషియర్‌ శ్రీధర్‌, వకీల్‌ సాబ్‌ దర్శకుడు శ్రీరామ్‌ వేణు, నేను.. ముగ్గురం నటించాం. సుకుమార్‌గారిదే ఆలోచన.. మీరు ముగ్గురూ వేస్ట్‌గా పడున్నారు కదా.. ముందుకు రండి అని మాపై సన్నివేశం చిత్రీకరించారు. ఆ సీన్‌ చూశాక మా ఆవిడ చాలా తిట్టింది. అప్పటినుంచి నేను ఎక్కడా కనబడలేదు. ఈ మధ్య మిత్రమండలి సినిమా కోసం నాతో ఏదో రీల్‌ చేయించారు. అది చూశాక కచ్చితంగా నేనే ట్రోల్‌ అవుతానని అనిపించి ఆ రీల్‌ బయటకు వదల్లేదు అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.

నిర్మాతగా..
కాగా బన్నీ వాసుది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్‌ వచ్చాడు. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా అల్లు అర్జున్‌ పరిచయమవగా వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అలా అతడు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో చేరాడు. తర్వాత గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో పార్ట్‌నర్‌ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఈమధ్యే స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్‌ పేరిట కొత్త బ్యానర్‌ ప్రారంభించాడు. ఈ బ్యానర్‌పై బన్నీ వాసు.. మిత్ర మండలి సినిమా నిర్మిస్తున్నాడు.

 

 

చదవండి: తండ్రి కాబోతున్న యంగ్‌ హీరో

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)