CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ
Breaking News
చెప్పలేనంత బాధ.. దేవుడిని ఒకటే ప్రార్థిస్తున్నా: బండ్ల గణేశ్
Published on Wed, 12/31/2025 - 09:34
ఈ రోజుతో 2025 ముగియనుంది. రేపటితో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది అనుభవాలను వర్ణిస్తూ కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్తూ నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. “2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారుతోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం కాదు.. నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం.
బతుకుకి కొత్త అర్థం
నా బతుకుకి కొత్త అర్థం, కొత్త దారి చూపించిన మహత్తర సమయం. భగవంతుడు స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలో అడుగుపెట్టి, నేను ఊహించనంత ప్రేమను, అండను, అద్భుతాలను ప్రసాదించిన సంవత్సరం ఇది. ఇలాంటి దివ్యమైన రోజులు వెళ్ళిపోతున్నాయంటే ఎందుకో చెప్పలేనంత బాధ, మధురమైన వేదన కలుగుతోంది.
ఒక్కటే ప్రార్థిస్తున్నా..
భగవంతుడిని నేను ఒక్కటే ప్రార్థిస్తున్నాను— 2025 లాగా ఆశ నింపే రోజులు, విశ్వాసాన్ని బలపరిచే సంఘటనలు, సంకల్పాన్ని దృఢం చేసే అనుభవాలు రాబోయే ప్రతి సంవత్సరంలో కూడా నాకు, మన అందరికీ దక్కాలని! అందరి జీవితాల్లో వెలుగు నిండాలి, అందరి ప్రయాణాలు అర్థవంతంగా మారాలి. అదే నా హృదయపూర్వక సంకల్పం అని ట్వీట్ చేశాడు.
కొత్త బ్యానర్
కాగా బండ్ల గణేశ్ (Bandla Ganesh).. ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, నీ జతగా నేనుండాలి, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. సింధూరం, ఉగాది, సుస్వాగతం, స్నేహితులు, శ్రీరాములయ్య, మల్లీశ్వరి, శివమణి, చిరుత, పోకిరి వంటి పలు చిత్రాల్లోనూ నటించాడు. తాజాగా ఇతడు బీజీ బ్లాక్‌బస్టర్స్ (బండ్ల గణేశ్ బ్లాక్‌బస్టర్స్) అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
**“2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారుతోంది.
ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం కాదు…
నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం.
నా బతుకుకి కొత్త అర్థం, కొత్త దారి చూపించిన మహత్తర సమయం.
భగవంతుడు స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలో అడుగుపెట్టి,
నేను ఊహించనంత ప్రేమను, అండను,…— BANDLA GANESH. (@ganeshbandla) December 31, 2025
You always have been a front runner in making blockbuster movies giving every second of your time and every ounce of your energy for cinema. Wish BG Blockbusters a glorious history in Indian cinema. 💝💝 @ganeshbandla https://t.co/ZeTkuEiTi3
— Bvs Ravi (@bvsravi22) December 30, 2025
చదవండి: అమ్మ ఒడిలో తలపెట్టుకుని బాధపడ్డా: త్రివిక్రమ్
Tags : 1