'హరిహర వీరమల్లు' బడ్జెట్‌ ఎంతో చెప్పిన నిర్మాత

Published on Thu, 06/05/2025 - 18:40

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu) వాయిదా పడటం ఇక లాంఛనమే అని చెప్పవచ్చు. ఈ మూవీ జూన్‌ 12న విడుదల కావాల్సి ఉండగ పలు కారణాల వల్ల విడుదలకు బ్రేకులు పడ్డాయి. త్వరలో అధికారికంగా కొత్త రిలీజ్‌ తేదీతో ప్రకటన రావచ్చని సమాచారం. సుమారు 5 ఏళ్లకు పైగా ఈ మూవీ కోసం నిర్మాత ఏఎం రత్నం పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే వడ్డీల వల్ల బడ్జెట్‌ భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు.

విడుదల వాయిదాకు కారణం ఏంటి..?
హరిహర వీరమల్లు విడుదలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇండస్ట్రీలో  ఉన్న మాట. ముంబైకి చెందిన ప్రముఖ ఫైనాన్స్‌ సంస్థలకు చెల్లించాల్సిన డబ్బు  క్లియరన్స్ చేస్తే తప్ప సినిమా విడుదల కాదనేది చిత్ర పరిశ్రమలోని వారికి తెలిసిన వాస్తవం. ఇప్పటికిప్పుడు అంత డబ్బు క్లియర్ చేయాలంటే సినిమా థియేటర్ హక్కులు మొదట విక్రయించాలి. కానీ, హరిహర వీరమల్లును  కొనేవారు ఎవరూ లేరు. అందుకు ప్రధాన కారణం నిర్మాత ఏఎం రత్నం చెబుతున్న రేటు పట్ల  ఎగ్జిబీటర్స్‌, బయ్యర్లు ఆమోదయోగ్యంగా లేరని టాక్‌. 

తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్ల వరకు  థియేటర్ రైట్స్‌ నుంచి రావచ్చు. కానీ, నిర్మాత క్లియర్‌ చేయాల్సిన ఫైనాన్స్‌ ఎంత అనేది చెప్పలేం. ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో ఓటీటీ నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఇప్పటికే వారు ముందు కుదుర్చుకున్న ఢీల్‌లో రూ. 5 కోట్లకు పైగానే కోత పెట్టారని సమాచారం. ఈ ఫైనాన్స్‌ మ్యాటర్స్‌ అన్నీ సెటిల్‌ కావాలంటే పవన్‌ కల్యాణ్‌ దిగిరావాల్సి ఉంటుంది. సినిమా పంపిణీ చేయడంలో ప్రముఖంగా వినిపించే పేర్లు దిల్‌ రాజు, అల్లు అరవింద్‌, మైత్రీ మూవీస్‌, సితార వంటి వారితో ఆయన లేదా తన తరఫు వారు ఎవరైనా చర్చలు జరిపితే హరిహర వీరమల్లుకు లైన్‌ క్లియర్‌ అయ్యే ఛాన్స్‌ వుంది. లేదంటే ఆ ఫైనాన్స్‌ సంస్థలకు పూర్తిగా డబ్బు అయినా చెల్లించాల్సి ఉంటుంది.

'వీరమల్లు' బడ్జెట్‌
హరిహర వీరమల్లు సినిమా కోసం   ఎంత బడ్జెట్‌ పెట్టారని నిర్మాత ఏఎం రత్నంను మీడియా వారు ప్రశ్నంచగా ఆయన ఇలా చెప్పారు. ' ఈ సినిమా కోసం నా కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ పెట్టాను. మూవీ షూటింగ్‌ ఆలస్యం కావడంతో వడ్డీలు కూడా బాగా పెరిగాయి.  అందరూ రూ. 200 కోట్ల బడ్జెట్‌ సినిమా అనుకుంటున్నారు. కానీ, అంతకు మించే ఈ మూవీ కోసం ఖర్చు చేశాం. సినిమా మీద నమ్మకంతోనే బడ్జెట్‌ విషయంలో రాజీ పడలేదు.' అని నిర్మాత అన్నారు. బడ్జెట్‌ అంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం పవన్‌ కల్యాణ్‌ కావడంతో ఈ మూవీకి సంబంధించి తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటున్నారని తెలుస్తోంది.

Videos

పేకాట డాన్లుగా.. టీడీపీ నేతలు

ఏం పీకుతామా!.. జగన్ వచ్చాక తెలుస్తది

చావును జయిస్తా.. ఏడాదికి 166 కోట్లు

లోకేష్ బూతులకు YSRCP పగిలిపోయే రిప్లే

ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ! బంగ్లాదేశ్ హిందూ హత్య కేసులో సంచలన విషయాలు

హీరోయిన్లపై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

మోదీకి లోకేశ్ వారసుడా? పవన్ కల్యాణ్ లో ఫ్రస్ట్రేషన్

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

Photos

+5

నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)

+5

కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)

+5

'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రిస్మస్‌ కళ.. అందంగా ముస్తాబైన చర్చిలు (ఫొటోలు)

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)