Breaking News

నా పెళ్లి కోసం నగలు కొంటున్నా.. పెళ్లిపై ప్రియాంక క్లారిటీ!

Published on Wed, 03/15/2023 - 15:37

బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక సింగ్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ ఆ మధ్య వార్తలు తెగ వైరల్‌ అయ్యాయి. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌తో బాగా పాపులర్‌ అయిన పింకీ ఎల్లో కలర్‌ లెహంగాలో పెళ్లికూతురిలా ముస్తాబైన ఫోటోలు షేర్‌ చేయడంతో తన పెళ్లి నిజమే అనుకున్నారంతా! కానీ నెలలు గడిచినా ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. అయితే ఇన్నాళ్లకు తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది పింకీ.

యూట్యూబ్‌లో 'నా పెళ్లి జ్యువెలరీ షాపింగ్‌' అంటూ ఏకంగా ఓ వీడియో చేసింది. 'నా పెళ్లి ఫిక్స్‌ అయింది, కాబోయే భర్త ఎవరు? అని అడుగుతున్నారు. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చేస్తున్నా. నిజంగానే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. సింపుల్‌గా ఈ పెళ్లి జరగబోతోంది. ఈ వివాహం కోసం నగలు తీసుకుందామనుకుంటున్నా. వీడియో చివర్లో అబ్బాయి గురించి అన్ని వివరాలు చెప్తాను, మాది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? చివర్లో చెప్పేస్తాను' అని వివరించింది. తర్వాత నగలు షాపింగ్‌ చేశాక అసలీ పెళ్లి తనది కాదని తన స్నేహితురాలిదని ట్విస్ట్‌ ఇచ్చింది. 'త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. నేను జస్ట్‌ ఇది ప్రాంక్‌ వీడియో చేశాను. నాకిప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు' అని కుండలు బద్ధలు కొట్టింది పింకీ.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌