Breaking News

కలిసిరాని సినిమాలు.. స్టార్‌ హీరోయిన్‌ అయ్యేదెప్పుడో?

Published on Thu, 11/27/2025 - 07:03

కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు.. హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan) పరిస్థితి కూడా ఇదే! బెంగళూర్‌కు చెందిన ఈ మూడు పదుల భామ 2019లో మాతృభాష (కన్నడం)లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్‌పై బ్యూటీ దృష్టి పడింది. అలా నాని గ్యాంగ్‌లీడర్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం విజయంతో శ్రీకారం అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ, ఈ మూవీ నిరాశ పరిచింది.

బ్రేక్‌
అయినా ప్రియాంక మోహన్‌ను లక్కు వదలలేదు. వెంటనే శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్‌ అనే చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ  ఇచ్చింది. ఆ చిత్రం హిట్‌ అవ్వడంతో అదే హీరోతో డాన్‌ అనే మరో చిత్రం చేసింది. అది సూపర్‌హిట్‌ అయ్యింది. ఆ తరువాతనే బ్రేక్‌ పడింది. సూర్యకు జంటగా నటించిన ఎదర్కుం తునిందవన్‌ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి తెలుగులో సరిపోదా శనివారం చిత్రం విజయం కాస్త ఊరటనిచ్చింది. 

ఉపయోగపడని ఓజీ
పవన్‌కల్యాణ్‌కు జంటగా ఓజీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ వస్తుందని తెగ సంబరపడిపోయిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం హిట్‌ అనిపించుకున్నా, ప్రియాంక మోహన్‌ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతే కాదు తెలుగులో ఇప్పటి వరకూ మరో అవకాశం రాలేదు. తమిళంలో జయంరవికి జంటగా నటించిన బ్రదర్‌ చిత్రం బోల్తా పడింది. ఆ తరువాత నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడీ కోపం చిత్రంలో గోల్డెన్‌ స్పారో అనే ప్రత్యేక పాటలో యాక్ట్‌ చేసింది. ఆ చిత్రం ఈమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. 

ఈ సినిమాలపైనే ఆశలు
కాగా ప్రస్తుతం కెవిన్‌కు జంటగా ఒక చిత్రం, మేడ్‌ ఇన్‌ కొరియా అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఏదైనా హిట్‌ అయితేనే ప్రియాంకమోహన్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయనే టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. కాగా సుమారు ఐదేళ్ల తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఆ బ్యూటీని వరించింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, భాషల్లో గత ఆరేళ్లుగా నటిస్తున్నా ఇంకా స్టార్‌ ఇమేజ్‌ కోసం కష్టపడుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)