Breaking News

ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్‌

Published on Sun, 06/08/2025 - 11:22

బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్‌ (Priyanka Jain), బుల్లితెర నటుడు శివకుమార్‌ (Shivakumar) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగారు. కొంతకాలంగా కలిసే ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. శనివారం (జూన్‌ 8న) శివకుమార్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా అండమాన్‌- నికోబార్‌లో అతడి పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని ప్రపోజల్‌ చేసింది.

బీచ్‌లో ప్రపోజల్‌..
నెచ్చెలి ఎదురుగా వచ్చి చేయందుకోమన్నాక ఎవరైనా ఎలా ఆగుతారు. శివ్‌ కూడా అంతే.. సంతోషంతో గంతేశాడు. తప్పకుండా అని అంగీకారంగా హత్తుకున్నాడు. అప్పుడు ప్రియాంక సగం పెళ్లి అయిపోనట్లే అన్నట్లుగా ఓ ఉంగరాన్ని అతడి వేలికి తొడిగింది. నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి. ఎప్పటికీ నాతోనే ఉండాలి. మనం జంటగా ఎన్నో సాహసాలు చేద్దాం. 

కలిసి ఎదుగుదాం..
ఇక్కడివరకు మన ప్రయాణం అంత సులువుగా జరగలేదు. తర్వాత కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చు. కానీ మనం ప్రతిరోజు దాన్ని ఉత్తమంగా మార్చుకునేందుకు ప్రయత్నిద్దాం. ఏయేటికాయేడు కాలాన్ని వృథా చేయకుండా జ్ఞాపకాలు కూడబెట్టుకుందాం. కలిసి ముందుకుసాగుదాం అని రాసుకొచ్చింది. ఇది చూసిన బుల్లితెర తారలు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సీరియల్స్‌తో పాపులర్‌
కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అయింది. మౌనరాగం సీరియల్‌లో శివకుమార్‌కు జంటగా నటించింది. అక్కడ మొదలైన పరిచయమే తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్న వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్‌ అయిపోగానే వివాహం చేసుకోవాలనుకున్నారు. 

గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌
కాకపోతే అంగరంగ వైభవంగా, కొన్నిరోజులపాటు పెళ్లి వేడుకలు జరుపుకోవాలని ప్లాన్‌ చేసుకుందట ప్రియాంక. అందుకు చాలా డబ్బు అవసరం అవుతుందని, అది సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటామని గతేడాది శివకుమార్‌ బయటపెట్టాడు. ఇప్పుడా సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదే వీరి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరగనున్నట్లు తెలుస్తోంది.

 

 

చదవండి: చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)