Breaking News

ప్రియాంక పీఆర్‌ స్టంట్‌? వాళ్లు నిజమైన ఫ్యాన్స్‌ కాదా?

Published on Thu, 11/20/2025 - 14:11

సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ ప్లీజ్‌ అని జనాలు వెంటపడతారు. ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వెంట సైతం ఫ్యాన్స్‌.. ఆటోగ్రాఫ్‌, ఫోటోగ్రాఫ్‌ అని వెంటపడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ప్రియాంకను ఇద్దరు అభిమానులు పదేపదే ఆటోగ్రాఫ్‌ అడిగారు. 

పీఆర్‌ స్టంట్‌?
తను కూడా వారి అభ్యర్థనను తిరస్కరించకుండా రెండుసార్లు ఆటోగ్రాఫ్‌ ఇచ్చింది. ఇది చూసిన జనాలు ఇది కచ్చితంగా పీఆర్‌ స్టంటే, వాళ్లసలు అభిమానులే కాదని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ వైరల్‌ వీడియోపై హాలీవుడ్‌ నటి బెల్లా థోర్న్‌ స్పందించింది. 'ఇది పీఆర్‌ స్టంట్‌ అని నేననుకోవడం లేదు. వాళ్లు ఆమెను విమానాశ్రయం లోపల నుంచి వెంబడిస్తున్నారు. 

అది నిజం కాదు
వీలైనన్ని సార్లు ప్రియాంక సంతకాన్ని సేకరించారు. ఆ ఆటోగ్రాఫ్స్‌ని  వారు ఆన్‌లైన్‌లో అమ్ముకుంటారు. నేను కూడా మొదట మీలాగే పొరబడ్డాను. కానీ వాళ్లిద్దరూ ఆమెను వదిలిపెట్టలేదు. తన వెంటపడ్డారు. దాంతో ప్రియాంక.. మంచితనంతో ఓపికగా అడిగిన ప్రతిసారి సంతకం చేసిందంతే! అని చెప్పుకొచ్చింది.

తెలుగులో ఎంట్రీ
ఇకపోతే బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా చాలాకాలం తర్వాత ఇండియన్‌ సినిమాకు రీఎంట్రీ ఇస్తోంది. అది కూడా తెలుగు సినిమా వారణాసితో! టాలీవుడ్‌లో ఇదే తన తొలి మూవీ కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.

 

 

చదవండి: పవన్‌ తండ్రికి క్యాన్సర్‌.. నోరు తిరగక, తిండి తినక..

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)