Breaking News

ప్రియుడితో బుల్లితెర నటి బ్రేకప్.. కన్‌ఫామ్ చేసేసిందిగా!

Published on Tue, 04/15/2025 - 18:40

బాలీవుడ్ భామ ప్రియాంక చాహర్ చౌదరి తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. ప్రియుడు  అంకిత్ గుప్తాతో బ్రేకప్ అయినట్లు ఇటీవల కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బుల్లితెర బ్యూటీ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా సరే తమ జీవితంలో మార్పు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. జీవితంలో ముందుకు సాగాలే తప్ప వెనకడుగు వేయకూడదని అంటోంది. ఆమె మాటలను చూస్తుంటే వీరిద్దరి మధ్య బ్రేకప్ నిజమేనని తెలుస్తోంది.

ప్రియాంక చాహర్ మాట్లాడుతూ.. ' మార్పు అనేది ఎల్లప్పుడూ మంచిదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మనం జీవితంలో అభివృద్ధి చెందడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగాల్సిందే. అది రిలేషన్‌లో ‍అయినా.. ఫ్యాషన్‌లో అయినా అదే మంచి నిర్ణయం" అని తెలిపింది. కాగా.. ఇటీవల ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ జంటపై బ్రేకప్ రూమర్స్ మొదలయ్యాయి. 

(ఇది చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్‌ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!)

అంతుకుముందు వీరిద్దరు కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'తేరే హో జాయేన్ హమ్' అనే టీవీ షో నుంచి సైతం అంకిత్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ప్రియాంక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా పరిణామాలతో ఈ జంట తమ రిలేషన్‌షిప్‌కు దాదాపు ఎండ్‌ కార్డ్‌ వేసినట్లేనని అర్థమవుతోంది. 

కాగా.. వీరిద్దరు మొదటసారిగా 'ఉదారియన్' సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తరువాత బిగ్ బాస్- 16లో  కనిపించారు. అంతేకాకుడా అంకిత్ గుప్తా, ప్రియాంకతో కలిసి బాలికా వధు, సద్దా హక్‌ సిరీయల్స్‌లో జంటగా నటించారు. మరోవైపు ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్‌ కూడా నటించనుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)