Breaking News

హీరోయిన్‌ కాకపోయుంటే ఏం చేసేదాన్నంటే?: ప్రియాంక మోహన్‌

Published on Sat, 06/08/2024 - 13:18

హీరోయిన్లు.. ఏ భాషలో అవకాశం వస్తే అక్కడ నటించేస్తారు. అలా ఒక్క తమిళ సినిమానే తీసుకుంటే హిందీ, మలయాళ, తెలుగు, గుజరాత్‌, కన్నడ, మరాఠీ భాషలకు చెందిన హీరోయిన్లు ఇక్కడ కథానాయికలుగా నటించేస్తున్నారు. కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా ఇతర భాష(కన్నడ)కు చెందిన నటే అన్నది గమనార్హం. మరో బ్యూటీ ప్రియాంక మోహన్‌.. మాతృభాష కన్నడలో నటించిన తరువాత తెలుగులో గ్యాంగ్‌లీడర్‌ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. 

కోలీవుడ్‌ నుంచి పిలుపు
ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా, కోలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ శివకార్తికేయన్‌ సరసన డాక్టర్‌, డాన్‌ చిత్రాల్లో వరుసగా నటించి విజయాలను అందుకున్నారు. అలాగే ఎదర్కుం తునిందవన్‌ చిత్రం ద్వారా సూర్యతో జత కట్టే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం నిరాశపరిచినా, ఈ మధ్య ధనుష్‌తో కలిసి నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న ప్రియాంక మోహన్‌ ఓ ఇంటర్వ్యూలో తాను ఇంజినీరింగ్‌ విద్యార్థిని అని చెప్పారు.

సినీరంగంలో ఎంట్రీ
చదువు పూర్తయిన తరువాత ఒక మంచి ఉద్యోగంలో చేరాలన్నదే తన కల అన్నారు. తాను సినీరంగంలోకి ప్రవేశించాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అందుకోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పారు. నటిని కాకుంటే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్నని తెలిపారు. ఇకపోతే తనకు నచ్చిన నటుడు రజనీకాంత్‌ అని చెప్పారు. ఆయన నటనతో పాటు తన సింప్లిసిటీ చాలా నచ్చుతుందన్నారు. ఏదో ఒక రోజు ఆయన్ని కలిసే అవకాశం రాకపోతుందా? అని ఎదురు చూస్తున్నానని నటి ప్రియాంక మోహన్‌ పేర్కొన్నారు.

చదవండి: ఈ సినిమాతో టాలీవుడ్‌ నాకు మెట్టినిల్లు అయిపోయింది: జ్యోతి రాయ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)