Breaking News

బాలీవుడ్‌ నటుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

Published on Wed, 08/03/2022 - 18:29

హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ప్రియాంక్‌ శర్మపై దాడి జరిగింది. జూలై 30న తన పేరెంట్స్‌తో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ఆస్పత్రికి వెళ్లిన ప్రియాంక్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయగా అతడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ప్రియాంక్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 'అమ్మ చెకప్‌ కోసం హాస్పిటల్‌ వెళ్లాం. అక్కడ ఓ వ్యక్తి సడన్‌గా నా ముందుకు వచ్చి నన్ను కొట్టడం ప్రారంభించాడు. అతడి చేయిని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించాను. కానీ అతడు మాత్రం ఎంతో శక్తి కూడదీసుకుని నాపై పిడిగుద్దులు కురిపించాడు. ఇంతలోనే ఆస్పత్రి సిబ్బంది పరిగెత్తుకుంటూ రావడంతో అతడు పారిపోయాడు. అప్పుడు నాకు చాలా భయమేసింది' అని నటుడు చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటనపై ప్రియాంక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం సీసీటీవీ ఫుటేజీ ఇవ్వడానికి నిరాకరించడం గమనార్హం.

ఈ దాడి జరిగిన మూడు రోజులకే ప్రియాంక్‌ శర్మ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆగస్టు 2న తన బర్త్‌డేను పురస్కరించుకుని ఓ స్వచ్చంద సంస్థ చిన్నపిల్లలతో కేక్‌ కట్‌ చేయించిన వీడియోను షేర్‌ చేశాడు. ఇకపోతే ప్రియాంక్‌ శర్మ.. స్ప్లిట్స్‌ విల్లా, బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లో పాల్గొన్నాడు. పంచ్‌ బీట్‌ రెండో సీజన్‌, మమ్‌ భాయ్‌ అనే వెబ్‌ సిరీస్‌లలోనూ నటించాడు. సంవత్సరాలపాటు ఒకే పాత్రలో నటించడం బోర్‌ అని అందుకే తాను సీరియల్స్‌ చేయలేదని, ఎప్పటికీ చేయబోనని అంటున్నాడు.

చదవండి: భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్‌, ప్రణీత ఏమందంటే?
సినిమా రిలీజ్‌ డేట్‌ మారడమనేది మిస్టరీ అయింది

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)