Breaking News

అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి

Published on Sat, 07/01/2023 - 10:53

కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్‌ అయింది. తెలుగులో కొంతకాలం స్టార్ హీరోయిన్‌గా రాణించిన ప్రియమణి పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల నాగచైతన్య 'కస్టడీ'లో సీఎంగా మెప్పించింది. త్వరలో షారుఖ్‌ 'జవాన్‌' చిత్రంతో రాబోతుంది.  ఈ నేపథ్యంలో  ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియమణి. కిస్‌ సీన్లకు బ్రేక్‌ ఇ‍వ్వడానికి  కారణం ఏంటో తాజాగా వెల్లడించింది.  

(ఇదీ చదవండి: ఆమెతో సుధీర్‌ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..)

'నేను స్క్రీన్‌పై ముద్దు సీన్లలో నటించకూడదని అనుకున్నాను. ఇప్పుడు నేను  అలాంటి పాత్రలు చేయడం కరెక్ట్‌ కాదనిపించింది.  సినిమాలో నాది ఒక పాత్ర అయినా వ్యక్తిగతంగా దాని వల్ల ఇబ్బంది పడతాను. అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేను తెరపై మరొక వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం అంత సౌకర్యంగా కూడా అనిపించదు.' అని చెప్పింది.

2021లో ZEE5లో వచ్చిన  'హిస్ స్టోరీ' వెబ్‌ సీరిస్‌లో సత్యదీప్ మిశ్రాతో రొమాన్స్‌ సీన్‌తో పాటు ముద్దు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్‌ చెప్పారు. కానీ వాటికి ఒప్పోకోలేదని ప్రియమణి గుర్తుచేసింది. అలాంటి సన్నివేశాలలో నటించమని భారీ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. అంతే కాకుండా భారీగానే రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేశారు. పెళ్లి తర్వాత అలాంటి వాటిలో నటించకూడదని కండీషన్స్‌ పెట్టుకున్నట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్‌ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!)

2017లో తనకు వివాహమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి బోల్డ్‌ సీన్స్‌లో నటించలేదు. సినిమాను అంగీకరించడానికి ముందే ఈ విషయం గురించి దర్శక-నిర్మాతలకు తెలియజేస్తానని చెప్పింది.  ఏ సినిమాలో నటించినా దాన్ని తమ ఇరు కుటుంబాల వాళ్లు చూస్తారు. అలాంటి సన్నివేశాల వల్ల వాళ్లు ఇబ్బంది పడడం తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియమణి అని తెలిపింది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)