Breaking News

చిన్న సినిమా పెద్ద హిట్‌.. బలగం కలెక్షన్స్‌ ఎంతంటే?

Published on Fri, 03/10/2023 - 15:48

ఈ మధ్య సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. లవ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాలు ఎక్కువైన తరుణంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తూ థియేటర్‌లో అడుపెట్టింది బలగం. మాయమైపోతున్న కుటుంబ బంధాలను, ఆప్యాయతలను, ఎమోషన్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపించి చివర్లో కళ్లు తుడుచుకునేలా చేసింది. మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు ప్రమోషన్స్‌ కన్నా పబ్లిక్‌ టాకే ఆయుధంగా పని చేసింది. ఫలితంగా రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి.

చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజుల్లోనే లాభాల పట్టింది. మొదటి రోజు రూ.55 లక్షలు, రెండో రోజు రూ.80 లక్షలు రాబట్టగా మూడో రోజు వచ్చేసరికి ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు మొత్తంగా ఏడు కోట్ల మేర గ్రాస్‌ (రూ. 3.07 కోట్ల షేర్‌) రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా మల్లేశం సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ప్రియదర్శి బలగంలో తెలంగాణ యువకుడిగా నటించాడు. ప్రియదర్శి తాత పాత్రలో సుధాకర్‌ రెడ్డి జీవించాడు. జబర్దస్త్‌ వేణు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవగా దిల్‌ రాజు నిర్మించాడు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)