Breaking News

ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్‌ సుయోధన.. ఆడియన్స్‌ను మెప్పించిందా?

Published on Fri, 03/27/2026 - 19:58

టాలీవుడ్‌ హీరో ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా 'సుయోధన' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చారు.  ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ మూవీతో ప్రియదర్శి మరో హిట్ కొట్టాడా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం.

ఈ మూవీ కథేంటంటే..

వరుణ్‌ (ప్రియదర్శి) ఒక 'ఫోలే' (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్‌. వరుణ్‌కి చిన్నప్పటి నుంచి 'సుయోధన' అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా భయపడుతుంటాడు. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటారు. ఆయనకు దుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. ఇది చూసే వరుణ్ భయపడుతున్నాడని అతని తల్లి రాధమ్మ, డాక్టర్లు చెప్పడంతో.. ప్రకాష్ నాటకాలు ఆపేస్తారు. ఇక వరుణ్ ఫోలీ స్టూడియో పెట్టుకొని జీవితం సాగిస్తుంటాడు. అప్పుడే సమిత (ద్రిషిక చందర్) ఒక డెమో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి రాగా.. వరుణ్‌కు పరిచయం అవుతుంది. సమిత షూట్ చేసిన ఓ పాత్ర అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తుంది. తనకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ప్రకాశే వరుణ్‌కు దుర్యోధనుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత  వరుణ్ తండ్రి హత్యకు గురవుతాడు. అసలు వరుణ్ తండ్రిని చంపింది ఎవరు? హత్యలో ఏదైనా రాజకీయ  కోణం ఏంటి? సుయోధన అనే శబ్దం వరుణ్‌కే ఎందుకు వినిపిస్తోంది? అసలు ఈ సినిమాలో సుయోధన ఎవరు? అనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

హీరో ప్రియదర్శికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్ర కొత్తే అయినప్పటికీ.. గతంలో ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇక్కడ టాలీవుడ్‌ ప్రేక్షకులకు 'ఫోలే' ఆర్టిస్ట్‌ అనేది కొత్త యాంగిల్ నచ్చిందనే చెప్పాలి. సినిమాలో వచ్చే శబ్దాలను ఇలా రికార్డ్ చేస్తారా? అనే విషయం సుయోధన ద్వారా ప్రేక్షకులకు అర్థమైంది. స్క్రీన్ ప్లేతో పాటు సినిమాలోని కొన్ని ట్విస్టులు ఆడియన్స్‌ను మెప్పిస్తాయి.

సినిమా ప్రారంభం నుంచే డైరక్టర్  సస్పెన్స్ క్రియేట్ చేయడంలోచాలా వరకు సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుల్లో వాట్ నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఈ కథలో 'సౌండ్' కీ రోల్‌ ప్లే చేసింది. దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్‌ బాగుంది.  అయితే అక్కడక్కడ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం కాస్తా  ఎంగేజింగ్‌గా ఉంటుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరింత ఆసక్తిగా ఉంటే బాగుండేది. దర్శకుడికి తొలి సినిమా అయినా తడబడకుండానే తెరకెక్కించాడు. ఈ కథ సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్‌ కూడా బాగానే వర్కవుట్ అయింది. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది సుయోధన. రొటీన్‌కు భిన్నంగా.. వినూత్నమైన మిస్టరీ థ్రిల్లర్‌ను చూడాలనుకుంటే 'సుయోధన' ట్రై చేయొచ్చు.

ఎవరెలా చేశారంటే..

ప్రియదర్శి మరోసారి తన పాత్రలో అదరగొట్టేశాడు.  సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  దుర్యోధనుడి పాత్రతో మెప్పించారు. ఆయన డైలాగ్స్, నటనతో ఈ సినిమాకు ప్లస్. సీనియర్ హీరోయిన్ ప్రేమ తల్లి పాత్రలో ఆకట్టుకున్నారు. హీరోయిన్ ద్రిశికా చందర్‌ తన గ్లామర్‌తో అలరించింది. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ  పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సినిమాలో హీరో సత్యదేవ్, బిత్తిరి సత్తి కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. సాంకేతికపరంగా చూస్తే సౌండ్  ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. జై క్రిష్ అందించిన సంగీతం ఫర్వాలేదు. ముఖ్యంగా కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నతంగా బాగున్నాయి.

 

Videos

భారత్ పై యుద్ధ ప్రభావం మోదీ అలర్ట్ సీఎంలతో అత్యవసర మీటింగ్

వంట నూనెలకూ యుద్ధం సెగ ఉక్కిరిబిక్కిరి...

CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు

నేను ఆత్మహత్య చేసుకుంటా.. మరో సంచలన వీడియోతో ఆరవ శ్రీధర్ బాధితురాలు

CNG గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల పడిగాపులు

యువకుడు - వివాహిత ఏలూరు ఇంస్టాగ్రామ్ ప్రేమ కధ చివరికి ఏం జరిగిందంటే

విజయవాడ YSRCP ఆఫీస్ లో" శ్రీరామనవమి వేడుకలు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమరావతి కాదు.. ATM ప్రతీ పైసా లెక్క చెప్పకపోతే.. బాబుపై MLC కల్పలతా రెడ్డి ఫైర్

ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది

Photos

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)