Breaking News

ప్రియదర్శన్‌ విడాకులకు, భార్యతో కలిసిపోవడానికి ఒక్కటే కారణం!

Published on Mon, 04/06/2026 - 15:18

కొన్ని బంధాలు ఎప్పుడు జతకలుస్తాయో, ఎప్పుడు విడిపోతాయో అర్థం కాదు. మలయాళ స్టార్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ కెరీర్‌ ప్రారంభించిన కొంతకాలానికే హీరోయిన్‌ లిస్సీతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమను పెళ్లి బంధంగా మార్చాలనుకున్నారు. 1990 డిసెంబర్‌ 13న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లిస్సీ తన పేరును లక్ష్మిగా మార్చుకుంది. అలాగే సినిమాలకు సైతం గుడ్‌బై చెప్పేసి ఇంటికే పరిమితమైపోయింది. 

2016లో విడాకులు
ఈ దంపతులకు కుమారుడు సిద్దార్థ్‌, కూతురు కల్యాణి సంతానం. ప్రియదర్శన్‌- లిస్సీ దంపతులు ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాగానే ఉన్న ఈ జంట తర్వాత సడన్‌గా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా అని వీరిమధ్య పెద్ద గొడవలు కూడా జరిగన దాఖలాలు లేవు. 2014లో లిస్సీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. 2016 సెప్టెంబర్‌లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. 

ఇటీవలే కలిసిపోయిన జంట
అప్పటినుంచి వీరు విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే విచిత్రంగా పదేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఈ విషయాన్ని ప్రియదర్శనే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం కలిసే ఉంటున్నామని, కాకపోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదన్నాడు. మరి అసలు ఈ జంట అప్పట్లో ఎందుకు విడిపోయింది? అన్నది చాలామంది అర్థం కాని ప్రశ్న!ఆ విషయం గురించి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ.. పెళ్లయిన కొన్నేళ్లకు జీవితం బోరింగ్‌గా అనిపించింది. మా ఇద్దరి మధ్య ఇగో కూడా పెరిగింది. 

అసలు కారణమిదే!
దానివల్లే పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. దాన్ని మరీ తెగేవరకు లాగకుండా విడిపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చాం, విడిపోయాం. కానీ కొన్నేళ్ల తర్వాత మేము ఒకరినొకరం మిస్‌ అయ్యాం, భాగస్వామి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. తోడు కావాలనిపించింది. అందుకే కలిసిపోయాం. అంతే..! అని సింపుల్‌గా బదులిచ్చాడు. అంటే అప్పుడు బోర్‌ కొట్టిందని విడిపోయారు.. ఇప్పుడు సింగిల్‌గా ఉంటే బోర్‌ కొడుతోందని మళ్లీ కలిసిపోయారన్నమాట!

చదవండి: ఆ సమస్య వల్ల పాటలకు దూరమైన స్టార్‌ సింగర్‌

Videos

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన ఇన్నోవా

రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు

జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు, స్పీకర్ కారుపై ఇంక్ చల్లి పారిపోయిన దుండగులు

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)