Breaking News

'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి

Published on Thu, 09/11/2025 - 11:27

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కలెక్షన్స్‌ పెద్దగా రావంటుంటారు! కానీ కల్యాణి ప్రియదర్శన్‌ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన 'కొత్త లోక మూవీ' ఆ వాదనను కొట్టిపారేసింది. సెంచరీలు కొడుతోంది. బాక్సాఫీస్‌ వద్ద రిలీజైన 13 రోజుల్లోనే రూ.202 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. ఇంతటి ఘన విజయం సాధించినందుకు అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. 

ఇదే నా సలహా: తండ్రి మెసేజ్‌
ఇలాంటి సమయంలో కల్యాణికి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. అదేంటనేది ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్‌ చేసింది. 'ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో.. విజయ గర్వాన్ని తలకెక్కించుకోకు, ఫ్లాప్‌ వచ్చినప్పుడు ఆ బాధను మనసులో మోయకు.. నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇదే! లవ్యూ..' అని కూతురికి మెసేజ్‌ పెట్టాడు. అందుకు కల్యాణి.. తప్పకుండా మీరు చెప్పింది పాటిస్తాను నాన్నా, లవ్యూ అని రిప్లై ఇచ్చింది.

సినిమా
తన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సైతం అభినందనలు తెలిపింది. 'మీ వల్లే సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ వస్తున్నాయి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు మాటలు రావడం లేదు. మన ఇండస్ట్రీలో కంటెంటే కింగ్‌. కథలో దమ్ముంటే మీరు దాన్ని అందలం ఎక్కిస్తారని మరోసారి రుజువు చేశారు' అని రాసుకొచ్చింది. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ 'కొత్త లోక: చాప్టర్‌ 1 చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్‌, నస్లీన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వం వహించాడు. దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 28న మలయాళంలో రిలీజైంది. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 29న సాయంత్రం తెలుగులో విడుదలైంది.

 

 

చదవండి: అంత వైరల్‌ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)