Breaking News

'భర్త పోయాక మొదటి మ్యారేజ్ డే'.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్

Published on Mon, 04/13/2026 - 21:13

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా కపూర్ తన తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది.  తన భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను గుర్తు చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన మొదటి వివాహా వార్షికోత్సవం కావడంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ లేఖను ఆమె పంచుకున్నారు. తమ బంధం ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పంజాబీ సాంప్రదాయంలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.

ప్రియా కపూర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'హ్యాపీ యానివర్సరీ జే . గతేడాది మన 8వ వార్షికోత్సవాన్ని నీ స్నేహితులతో కలిసి జరుపుకున్నాం. ఆ వేడుక చాలా సందడిగా, ఆత్మీయంగా, నవ్వులతో నిండిపోయింది. నువ్వు నా వైపు చూసి, మనం రాబోయే 7 జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పావు. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. మన ఏడ వార్షికోత్సవం రోజు నువ్వు నా కోసం అందమైన లేఖ రాశావు. అత్యంత అమూల్యమైన బహుమతి. అందులోని ప్రతి పదాన్ని నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నువ్వు కేవలం నా భర్తవి మాత్రమే కాదు. నువ్వు నా ఆత్మబంధువువి. నా హృదయ స్పందనవి. నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలిసినంతలో అత్యంత సులభమైన విషయం. నువ్వు సాధారణమైనదాన్ని కూడా అద్భుతంగా మార్చావు.' అంటూ రాసుకొచ్చింది.

నటి ప్రియా సచ్‌దేవ్ కపూర్ తన లేఖను అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. సంజయ్ కపూర్ కేవలం తన గతం మాత్రమే కాదని.. తన భవిష్యత్తులో కూడా ఒక భాగమని ఆమె తెలిపారు.  మా కథ ఇంకా ముగియలేదని.. మాబంధం శాశ్వతమైనదని కూడా ఆమె పేర్కొన్నారు. మనం అనేక జన్మల పాటు కలిసి ఉంటామని అతను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రియా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలన్నీ తిరిగి తీసుకువస్తే.. మళ్లీ నీతోనే జీవిస్తానని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.

కాగా.. జూన్ 12, 2025న, ఇంగ్లాండ్‌లో ఒక పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ మరణించారు. ఆయన 2017లో ప్రియ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు సంజయ్‌కు కరిష్మా కపూర్‌తో గతంలో జరిగిన వివాహం జరిగింది. వీరిద్దరికి సమైరా, కియాన్ అనే పిల్లలు ఉన్నారు.

 

 

 

Videos

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)