ప్రియుడితో పెళ్లి ప్రకటించిన టాప్‌ హీరోయిన్‌

Published on Thu, 08/08/2024 - 10:36

కమలహాసన్‌  ఇండియన్‌ –2 సినిమాలో మెరిసిన నటి ప్రియా భవానీ శంకర్‌ తాజాగా శుభవార్త చెప్పారు. త్వరలో తన ప్రియుడితో కలిసి ఏడు అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. గోపీచంద్ భీమా సినిమాతో పాటు సంతోష్ శోభన్‌తో  కల్యాణం కమనీయం అనే సినిమాలో నటించిన ఈ చెన్నై బ్యూటీ నాగచైతన్య ధూత వెబ్‌ సిరీస్‌తో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇప్పటికే ధనుష్, విశాల్, శింబు, కార్తి  వంటి స్టార్‌ హీరోలతో ఆమె కలిసి నటించింది.  ఆగష్టు 15న డీమాంటీ కాలనీ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెసేజ్‌ చేసినా లింక్‌ పెట్టేశారు: ప్రియా భవానీ శంకర్‌
ప్రియా భవానీ శంకర్‌ తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్‌ అనే వ్యక్తితో తాను  పదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నానని ఓపెన్‌ అయింది. సినీ పరిశ్రమలోకి రాక ముందునుంచే రాజ్‌తో  ప్రేమలో ఉన్నట్లు ఆమె తెలిపింది. అయితే,  ప్రియుడితో డేటింగ్‌పై ఆసక్తి చూపుతున్న ఈ బ్యూటీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదనే ప్రచారం జరిగింది. దీంతో వారిద్దరూ విడిపోయారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

తాను చాలామంది హీరోలతో కలిసి నటించడం వల్ల ఏదైనా సందర్భంలో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే వెంటనే తప్పుగా ప్రచారం చేశారని చెప్పింది. వారితో రిలేషన్‌లో ఉన్నానంటూ కూడా కామెంట్‌ చేశారని గుర్తుచేసుకుంది. లక్కీగా ఇప్పుడు వారందరికీ పెళ్లి అయిపోయిందని సరదాగా చెప్పుకొచ్చింది. ఒకవేళ కళాశాల చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి ప్రపోజల్‌ వచ్చి ఉంటే రాజ్‌తో ఈ పాటికే జరిగి ఉండేదన్నారు. కాగా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

తన ప్రియుడు రాజ్‌ గురించి చెబుతూ తన జీవితంలోకి రాజ్‌ రావడంతోనే అదృష్టం అని పేర్కొన్నారు. తను లేకపోతే తాను ఇప్పటికీ ఒక మధ్య తరగతి కుటుంబ యువతిగానే మిగిలిపోయేదాన్నని అన్నారు. రాజ్‌ అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి చేర్చిందనే అభిప్రాయాన్ని నటి ప్రియాభవానీ శంకర్‌ వ్యక్తం చేశారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)